ఆ సమస్యతో పిల్లలు పుట్టి చనిపోతున్నారు.. మళ్లీ గర్భం ధరిస్తానా?
హలో మేడమ్.. నాకు Bicornuate Uterus సమస్య ఉంది. పిల్లలు పుట్టి చనిపోతున్నారు. ఇప్పుడు మళ్లీ గర్భం ధరించా. అది నిలిచే మార్గం చెప్పండి.
హలో మేడమ్.. నాకు Bicornuate Uterus సమస్య ఉంది. పిల్లలు పుట్టి చనిపోతున్నారు. ఇప్పుడు మళ్లీ గర్భం ధరించా. అది నిలిచే మార్గం చెప్పండి.
- ఓ సోదరి
జ: మీకు పిల్లలు పుట్టి చనిపోతున్నారని రాశారు.. కానీ ఏ నెలలో పుట్టారు? ఎంతమంది పుట్టి చనిపోయారు? గర్భసంచిలో సమస్యతో పాటు ఇతరత్రా సమస్యలేమైనా ఉన్నాయేమో తెలుసుకోవడానికి అవసరమైన యాంటీబాడీ పరీక్షలు, జన్యు పరీక్షలు.. మొదలైనవి చేయించుకున్నారా? లేదా?.. ఈ వివరాలన్నీ తెలిస్తే తప్ప మీకు సలహా ఇవ్వడం కష్టం.
మా దగ్గరికి వచ్చే చాలామంది పేషెంట్స్ Bicornuate Uterus అనే సమస్య ఉందని చెప్పినా సరే.. అది 3డి ట్రాన్స్ వెజైనల్ స్కాన్, లేదా ఎంఆర్‌ఐ చేయడం ద్వారా గర్భాశయ లోపాన్ని పూర్తిగా అంచనా వేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొంతమందికి పూర్తి సెప్టమ్ లేదా పూర్తిగా రెండుగా విడిపోయిన గర్భాశయం.. ఇలా రకరకాల అదనపు వివరాలు తెలుస్తాయి. అసలు మీరు తిరిగి గర్భం ధరించే ముందుగానే ఈ పరీక్షలన్నీ చేయించుకోవాల్సింది. ఒకవేళ సెప్టమ్ గనుక ఉంటే దాన్ని హిస్టరోస్కోపీ సర్జరీ ద్వారా పూర్తిగా తొలగించి గర్భాశయాన్ని ఒకటిగా చేయచ్చు. అలాగే వ్యాధి నిరోధక శక్తిలో సమస్యలైతే.. దానికి మాత్రలు, ఇంజెక్షన్ల రూపంలో చికిత్స మొదలుపెట్టచ్చు. జన్యుపరమైన లోపాలైతే ప్రి-ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్ ద్వారా మెరుగైన ఫలితాలు సాధించచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.