కుట్లు చీము పట్టాయి.. తగ్గేదెలా?
హలో డాక్టర్. నాకు సిజేరియన్ అయి 5 నెలలవుతోంది. గత నెలలో నా కుట్లు చీము పట్టాయి. డాక్టర్‌ని సంప్రదిస్తే మందులిచ్చారు. ఇప్పుడు కాస్త తగ్గాయి.. కానీ ఇన్ని రోజులైనా ఇంకా నా కుట్లు ఎందుకు పచ్చిగానే ఉన్నాయి. ఇవి త్వరగా మానాలంటే ఏం చేయాలి? చెప్పగలరు. - ఓ సోదరి
హలో డాక్టర్. నాకు సిజేరియన్ అయి 5 నెలలవుతోంది. గత నెలలో నా కుట్లు చీము పట్టాయి. డాక్టర్‌ని సంప్రదిస్తే మందులిచ్చారు. ఇప్పుడు కాస్త తగ్గాయి.. కానీ ఇన్ని రోజులైనా ఇంకా నా కుట్లు ఎందుకు పచ్చిగానే ఉన్నాయి. ఇవి త్వరగా మానాలంటే ఏం చేయాలి? చెప్పగలరు. - ఓ సోదరి
జ: మామూలుగా ఆపరేషన్ అయిన 48 గంటల్లోనే చర్మం చివర్లు దగ్గరికొచ్చేస్తాయి (ప్రైమరీ హీలింగ్ పూర్తవుతుంది). వారం రోజుల కల్లా ఇంకా కుట్లలో పచ్చిదనం ఉండకూడదు. అయితే మీకు ఐదు నెలలవుతున్నా ఇంకా చీము వస్తోందంటే.. కాస్త క్లిష్టమైన ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందని అర్థం. దీనికి రకరకాల కారణాలుండచ్చు. మీకు రక్తహీనత ఉన్నా, మీ వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నా, మీకు చాలా సేపు నొప్పులొచ్చి ఉమ్మనీరు పోయాక ఆలస్యంగా సిజేరియన్ చేసినా.. ఇలా ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ చీమును కల్చర్ అండ్ సెన్సిటివిటీ పరీక్షకు పంపించడం ద్వారా ఏ మందులు పనిచేస్తాయో తెలుసుకొని ఆ మందులు వాడితే కొంత వరకు ఫలితం ఉండచ్చు. అయినా కూడా తగ్గకపోతే.. లోపల ఫేషియాకు వేసిన సూచర్ మెటీరియల్ (కరిగిపోని దారం) ఉంటుంది. ఆపరేషన్ చేసిన చోట తిరిగి ఓపెన్ చేసి ఆ దారమంతా తీసేసి, లోపలి వరకు శుభ్రం చేసి, మళ్లీ తాజాగా కుట్లు వేయాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.