Exercise: అమ్మాయిలకు పరుగు తెచ్చే చురుకు!

రోజూ వ్యాయామం చేయాలన్న ఆలోచన రాగానే అందరికి గుర్తొచ్చే మార్గం... నడక. కానీ, వేగంగా బరువు తగ్గాలన్నా, శరీరంతో పాటూ మనసూ చురుగ్గా మారాలన్నా పరుగుని ఎంచుకో మంటున్నారు నిపుణులు. మరి దీని ప్రయోజనాలేంటో తెలుసుకుందామా!

Published : 02 May 2023 00:12 IST

రోజూ వ్యాయామం చేయాలన్న ఆలోచన రాగానే అందరికి గుర్తొచ్చే మార్గం... నడక. కానీ, వేగంగా బరువు తగ్గాలన్నా, శరీరంతో పాటూ మనసూ చురుగ్గా మారాలన్నా పరుగుని ఎంచుకో మంటున్నారు నిపుణులు. మరి దీని ప్రయోజనాలేంటో తెలుసుకుందామా!

* పరుగు వల్ల శరీరం మొత్తానికి వ్యాయామం అందుతుంది. అయితే, నాలుగ్గోడల మధ్య ట్రెడ్‌మిల్‌పై పరుగులు పెట్టడం వల్ల కొంత మార్పు కనిపించినా.. ఆరుబయట ఆ చేస్తే శరీరంతో పాటు మెదడూ ఉత్సాహంగా స్పందిస్తుంది. ముఖ్యంగా సూర్యకిరణాలు, ప్రకృతి, చల్లటి వాతావరణం అన్నీ కలిసి మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మెదడుకి తగినంత ఆక్సిజన్‌ కూడా అందుతుంది. డిప్రెషన్‌ అదుపులో ఉంటుంది. వ్యాధినిరోధకశక్తీ మెరుగుపడుతుంది.

* రోజూ క్రమం తప్పకుండా జాగింగ్‌ చేసే అలవాటు ఉన్న మహిళలకు గర్భాశయ, రొమ్ము క్యాన్సర్‌ ముప్పు తక్కువని చెబుతోంది ఓ అమెరికన్‌ విశ్వవిద్యాలయ అధ్యయనం. అంతే కాదు ఈ వ్యాయామ అలవాటు శరీరంలోని హార్మోన్ల అసమతుల్యత క్రమబద్ధం చేసి ఈస్ట్రోజెన్‌ హెచ్చుతగ్గులను అదుపు చేస్తుంది. ఫలితంగా భావోద్వేగాలూ అదుపులో ఉంటాయి. కండరాల సాంద్రత మెరుగుపడుతుంది.

* వ్యాయామం చేయడానికి సమయం లేదనుకునే వారు రోజూ కనీసం 5 నిమిషాలు పరుగెట్టినా చాలు, కెలొరీలు వేగంగా కరుగుతాయట. పెద్ద మొత్తంలో కెలొరీలు కరగాలనేది మీ లక్ష్యమైతే ఇదే మంచి మార్గం కూడా. ఇలా రోజూ కనీసం 20 నిమిషాలైనా చేయడం వల్ల బరువు తగ్గడంతో పాటూ చక్కని శరీరాకృతీ సొంతమవుతుంది. అయితే, ఎంత సేపు పరుగెత్తాలన్నది డాక్టరు సలహా మీద నిర్ణయం తీసుకోవడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్