Parenting: పిల్లల ఇష్టాలను గుర్తించండి!

తమ ఇష్టాలను, ఆశయాలను పిల్లల ద్వారా నెరవేర్చుకోవాలి అనుకుంటున్న తల్లిదండ్రులే ఎక్కువ. మరి పిల్లల అభిప్రాయాలు, ఆలోచనల సంగతేంటి? వాటిని గుర్తించాలి అంటున్నారు నిపుణులు.

Published : 02 Jun 2023 00:17 IST

తమ ఇష్టాలను, ఆశయాలను పిల్లల ద్వారా నెరవేర్చుకోవాలి అనుకుంటున్న తల్లిదండ్రులే ఎక్కువ. మరి పిల్లల అభిప్రాయాలు, ఆలోచనల సంగతేంటి? వాటిని గుర్తించాలి అంటున్నారు నిపుణులు. అప్పుడే వారి ప్రతిభనూ వెలికి తీయొచ్చని చెబుతున్నారు.

ఒత్తిడి చెయ్యొద్దు... బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని, ఆ చిన్న మెదళ్లని ఎక్కువ ఒత్తిడికి గురిచేయకూడదు. అలా చేస్తే చదువును ఇష్టంగా కాకుండా, భారంగా తీసుకునే ప్రమాదం ఉంది. వాళ్లకు ఎప్పుడు చదవాలనిపిస్తే అప్పుడు చదవనివ్వండి.

పునరాలోచింప చేయండి... తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగస్థులు అయితే పిల్లలతో ఎక్కువగా మాట్లాడే తీరిక ఉండకపోవచ్చు. కానీ సమయం దొరికినప్పుడల్లా పిల్లలతో గడిపితే వారి ఆలోచనలు, ప్రణాళికలను మీతో పంచుకుంటారు. వాటిలో తప్పులు దొర్లితే మార్పులు, చేర్పులు చెప్పి వారిని ఇంకా మెరుగ్గా ఆలోచించమని చెప్పండి.

సృజానాత్మకతను గుర్తించండి... ప్రతి ఒక్కరిలో ఏదోక ప్రతిభ ఉంటుంది. డాన్స్‌, పాటలు పాడటం, స్విమింగ్‌, క్రికెట్‌ ఆడటం, వాయిద్యాలు వాయించడం ఇలా.. వారికి మక్కువ ఉన్న వాటిని ప్రయత్నించమని ప్రోత్సహించండి. అలా చేయడం వల్ల వారిలో నూతన చైతన్యం వచ్చి మరింత ప్రతిభను కనబరచడమే కాకుండా చదువులోనూ చురుగ్గా ఉంటారు.

వాటినీ నేర్పాలి... చాలా మంది అమ్మానాన్నలు తమ కష్టాన్ని పిల్లలకు తెలియకుండా చేస్తారు. అలా కాకుండా వారు తినే ఆహారం, దుస్తులు, నిత్యావసరాలకు ఎంత ఖర్చు అవుతుంది, అది ఎంత కష్టపడితే వస్తుంది.. లాంటి అంశాలతో పాటు, ఎలా పొదుపు చెయ్యాలి అనేదీ వారికి తెలియజెప్పాలి. మనకంటే ఎక్కువ కష్టాల్లో ఉన్నవారి జీవితాలను ఉదాహరణగా చూపించి, వారికి ఆర్థిక సాయాన్ని చేయమని చెప్పండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్