ఆ పరీక్షలు చేసేటప్పుడు నొప్పిగా ఉంటుందా?

పెళ్లయ్యాక పిల్లలు పుట్టకపోతే చేయించుకునే వెజైనల్‌ అల్ట్రాసౌండ్‌, పెల్విక్‌ అల్ట్రాసౌండ్‌ పరీక్షల్లో నొప్పి తెలియకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి? అలాగే నార్మల్‌ అల్ట్రాసౌండ్‌ స్కాన్‌లో సర్విక్స్, ఫెలోపియన్‌ ట్యూబ్స్‌, ఎండోమెట్రియం....

Published : 08 Sep 2022 20:36 IST

పెళ్లయ్యాక పిల్లలు పుట్టకపోతే చేయించుకునే వెజైనల్‌ అల్ట్రాసౌండ్‌, పెల్విక్‌ అల్ట్రాసౌండ్‌ పరీక్షల్లో నొప్పి తెలియకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి? అలాగే నార్మల్‌ అల్ట్రాసౌండ్‌ స్కాన్‌లో సర్విక్స్, ఫెలోపియన్‌ ట్యూబ్స్‌, ఎండోమెట్రియం థిక్‌నెస్‌ని కచ్చితంగా తెలుసుకోవడం వీలవుతుందా?- ఓ సోదరి

జ: వెజైనల్‌ అల్ట్రాసౌండ్‌ అనేది పెళ్లైన, కలయికలో పాల్గొనే స్త్రీలకు మాత్రమే చేస్తారు. ట్రాన్స్‌ వెజైనల్‌ ప్రోబ్‌ చాలా సన్నగా ఉంటుంది. అందుకని దీనివల్ల నొప్పి కలిగే అవకాశం లేదు. అలాగే ఇది వాడేటప్పుడు జెల్‌ వాడతారు కాబట్టి రాపిడి అనేది ఉండదు. ఇంకా మీకు నొప్పి తెలియకుండా ఉండాలంటే మీరు శారీరకంగా, మానసికంగా రిలాక్స్ అవడం ముఖ్యం. కండరాలు బిగబట్టకుండా వదులుగా ఉంచితే నొప్పి ఉండదు. నార్మల్‌ స్కాన్‌లో ఎండోమెట్రియం థిక్‌నెస్‌ కచ్చితంగా తెలుస్తుంది. కానీ ఈ స్కాన్‌ ద్వారా ఫెలోపియన్‌ ట్యూబ్స్‌, సర్విక్స్‌ వివరాలు తెలుసుకోవడం మాత్రం కష్టం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్