పండు పండుకో కట్టర్‌!

పండ్లు ఆరోగ్యానికి మంచివని తెలిసినా.. కొంతమంది వాటిని తినడానికి అశ్రద్ధ చూపుతుంటారు. వాటిని కట్‌ చేసుకొని తినడం కూడా పెద్ద పనిగా భావిస్తారు. అలాంటి వాళ్ల కోసమే ప్రస్తుతం ఫ్రూట్‌ కట్టర్స్‌/స్లైసర్స్‌

Updated : 03 Jun 2023 17:52 IST

పండ్లు ఆరోగ్యానికి మంచివని తెలిసినా.. కొంతమంది వాటిని తినడానికి అశ్రద్ధ చూపుతుంటారు. వాటిని కట్‌ చేసుకొని తినడం కూడా పెద్ద పనిగా భావిస్తారు. అలాంటి వాళ్ల కోసమే ప్రస్తుతం ఫ్రూట్‌ కట్టర్స్‌/స్లైసర్స్‌ అందుబాటులోకొచ్చాయి. మామిడి, పుచ్చకాయ, తర్బూజా, యాపిల్‌.. వంటి పండ్లను కట్‌ చేయడానికి ఆయా పండ్ల ఆకృతుల్లో ఉన్న కట్టర్స్‌ మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటిని పండుపై ఉంచి.. బలంగా కిందికి ప్రెస్‌ చేయడం వల్ల.. వాటికి ఉండే పదునైన బ్లేడ్స్‌ పండును సమాన భాగాలుగా కట్‌ చేస్తాయి. ఇక ఫ్రూట్‌ సలాడ్‌, కేక్స్‌, ఐస్‌క్రీమ్స్‌ తయారీలో అరటి పండును ముక్కలుగా చేసి ఉపయోగిస్తాం. దీనికీ బనానా స్లైసర్‌ చక్కగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ పండుపై పెట్టి ఒక్కసారి ప్రెస్‌ చేస్తే చాలు.. శ్రమ లేకుండా చిటికెలో పండును ముక్కలుగా కట్‌ చేయచ్చు.

ఇక పైనాపిల్‌, అవకాడో, కివీ.. వంటి పండ్ల గుజ్జును వేరు చేసేందుకు ప్రత్యేకమైన కట్టర్స్‌ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కమలాఫలం తొక్క సులభంగా తొలగించడానికి, దానిమ్మ గింజల్ని ఈజీగా ఒలించేందుకు కూడా ప్రత్యేకమైన ఫ్రూట్‌ గ్యాడ్జెట్స్‌ లభిస్తున్నాయి. పైగా ఈ గ్యాడ్జెట్స్‌ శుభ్రం చేయడం కూడా సులువే! కాబట్టి వీటిని ఉపయోగిస్తే సమయం ఆదా అవడంతో పాటు శ్రమా తగ్గుతుంది. అలాంటి ఫ్రూట్‌ కట్టర్స్‌/స్లైసర్స్‌పై మీరూ ఓ లుక్కేయండి!

Photos: Amazon.in

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్