బ్రేకింగ్

breaking
07 May 2024 | 15:43 IST

రైతు భరోసా నిధుల విడుదలకు ఎన్నికల సంఘం బ్రేక్‌

హైదరాబాద్‌: తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన తర్వాతే నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రైతు భరోసా చెల్లింపులపై సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదంటూ వేణు కుమార్‌ అనే వ్యక్తి ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం.. రేవంత్‌ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంటూ నిధుల విడుదలకు బ్రేక్‌ వేసింది. 5 ఎకరాల పైబడి భూమి ఉన్నవారికి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి రైతు భరోసా చెల్లింపులు చేస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని

తాజా వార్తలు