నలభై దాటారా...!

మీ వయసు నలభై దాటిందా... వృద్ధాప్య సంకేతాలు కనిపిస్తున్నాయా.. ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా... అవునండి అవును అంటారా... నలభైదాటిన మహిళలు ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసుకుందామా...

Published : 15 Jun 2021 01:54 IST

మీ వయసు నలభై దాటిందా... వృద్ధాప్య సంకేతాలు కనిపిస్తున్నాయా.. ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా... అవునండి అవును అంటారా... నలభైదాటిన మహిళలు ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసుకుందామా...
జుట్టు ఊడుతోందా...! సహజంగానే చాలామంది పురుషులు, మహిళల్లో నలభై తర్వాత జుట్టు పలచబడటం, ఊడటం మొదలవుతుంది. కాబట్టి మార్పును అంగీకరించాలి.
వ్యాయామం చేయండి... బాధ్యతలంటూ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తారు. పోషకాహారాన్ని తీసుకోరు. తగినంత వ్యాయామం చేయరు. దాంతో బరువు పెరుగుతారు. దీనివల్ల మరిన్ని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వ్యాయామం మొదలుపెట్టాలి.
విటమిన్లను వీడొద్దు.. విటమిన్‌ లోపం ఏ వయసులోనైనా రావొచ్చు. నలభైల్లో పడిన తర్వాత విటమిన్‌ - డి లోపం ఏర్పడితే ఎముక సాంద్రత తగ్గి అది ఆస్టియోపోరోసిస్‌కు దారితీయొచ్చు. అంతేకాదు ఆందోళనా, కాలానుగుణంగా వచ్చే ఇబ్బందులూ ఎదురుకావొచ్చు. అలాగే ఐరన్‌, రైబోఫ్లావిన్‌, విటమిన్‌-బి తక్కువ కాకుండా చూసుకోవాలి.
రాత్రి నిద్రకు ముందు భోజనం వద్దే వద్దు.. పనివేళలు, తీరిక లేకపోవడం, అలవాట్లు... అంటూ కొందరు రాత్రిపూట చాలా ఆలస్యంగా భోజనం చేస్తుంటారు. ఈ సమయంలో శరీరం విశ్రాంతి తీసుకోవాలనుకుంటుంది. అలాంటప్పుడు పిండి పదార్థాలు దండిగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే అది అరగడానికి చాలా సమయం పడుతుంది. కొందరిలో అరగదు కూడా. దాంతో బరువు పెరుగుతారు. మరో విషయం.. నలభై దాటిన వారు బరువు తగ్గడం కాస్త కష్టమే.
*ఈ వయసులో మానసికంగా వచ్చే ఇబ్బందులను అశ్రద్ధ చేయొద్దు. ఏటా కొన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా మహిళలు రొమ్ముల్లో గడ్డల్లాంటివి ఉన్నాయేమో స్వీయ పరీక్షతోపాటు వైద్యుల సాయమూ తీసుకోవాలి. అలాగే పాప్‌స్మియర్‌ పరీక్ష కూడా చేయించుకోవాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్