అందాన్ని పెంచే పాపిట!

ముఖ అందాన్ని పెంచడంలో జుట్టు పాత్ర ఎక్కువే. మనం రోజూ తీసుకునే పాపిట కూడా... కీలకపాత్ర వహిస్తుందంటారు సౌందర్య నిపుణులు. సాధారణంగా మధ్య లేదా పక్క పాపిట తీసుకుంటాం

Updated : 31 Jul 2021 03:41 IST

ముఖ అందాన్ని పెంచడంలో జుట్టు పాత్ర ఎక్కువే. మనం రోజూ తీసుకునే పాపిట కూడా... కీలకపాత్ర వహిస్తుందంటారు సౌందర్య నిపుణులు. సాధారణంగా మధ్య లేదా పక్క పాపిట తీసుకుంటాం. కానీ అది మనకు నప్పుతుందా అనేది పెద్దగా పట్టించుకోం. కానీ ఈసారి ఈ సూచనలు పాటించి చూడండి.
ముఖం గుండ్రంగా ఉన్న వారు సరైన హెయిర్‌ స్టైల్‌ ఎంచుకోక పోతే.. వారి ముఖం మరింత పెద్దదిగా కనిపిస్తుంది. వీరికి మధ్య లేదా పక్క పాపిట బాగుంటుంది. పక్క పాపిడి సైతం కాస్త డీప్‌గా అంటే.. చెవులకు కాస్త పైనుండి తీసుకోవాలి. ఈ రెండూ ముఖాన్ని కాస్త సన్నగా కనిపించేట్లు చేస్తాయి.
* కోలముఖం: పక్క పాపిట, డీప్‌ సైడ్‌ పార్టింగ్‌, మధ్య పాపిట.., జిగ్‌జాగ్‌ స్టైల్‌... ఇలా ఏదైనా ప్రయత్నించొచ్చు.
* చతురాస్రాకార ముఖాకృతి: వీరి నుదురు కాస్త విశాలంగా ఉంటుంది. కాబట్టి దాన్ని కప్పి ఉంచేలా హెయిర్‌ స్టైల్‌ ఉండాలి. ఇందుకు పక్క పాపిట చక్కని ఎంపిక. ఇలా చేస్తే ముఖం నాలుగు పలకలుగా కనిపించకుండా ఉంటుంది.
* పొడవు ముఖం: మధ్యపాపిట తీస్తే గుండ్రంగా కనిపిస్తుంది. వీరు జుట్టుని వదిలేస్తే బాగుంటుంది.  
* వజ్ర ముఖాకృతి: వారి నుదుటి భాగం, దవడల దగ్గరగా కాస్త షార్ప్‌గా ఉంటుంది. వీటిని కనిపించనీయకుండా చేయగలిగితే ముఖం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇందుకోసం పక్క పాపిట తీసి జుట్టుని వదిలేయండి.  
* హృదయాకార ముఖం: పక్కపాపిట కాస్త పొడవుగా తీయాలి. బాగా పొడవు జుట్టు ఉంటే మాత్రం ఏ రకం పాపిడి తీసుకున్నా... బానే ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్