Published : 20/02/2022 00:43 IST

క్రీమ్‌ రాయడానికీ ఓ పద్ధతి

చర్మాన్ని కాపాడుకునేందుకు రకరకాల క్రీమ్‌లు రాస్తుంటాం. మరి.. వాటిని సరిగానే రాస్తున్నారా? అది చాలా ముఖ్యం అంటున్నారు... సరి చూసుకోండి.

* క్లెన్సర్‌.. చర్మ రక్షణ కార్యక్రమం దీంతోనే ప్రారంభమవ్వాలి. ఏ సమయంలోనైనా క్రీమ్‌ పూయడానికి ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవడం తప్పనిసరి. సబ్బు/ ఫేస్‌వాష్‌కు కొద్దిగా నీటిని జత చేసి రుద్దాలి. దానికి ముందు ముఖాన్ని తడిచేసుకోవడం మరవద్దు. కనీసం రెండు నిమిషాలు వృత్తాకారంలో రుద్దాక కడగాలి. అప్పుడే చర్మరంధ్రాల లోతుల్లోని మురికీ బయటికి వచ్చేస్తుంది.

* టోనర్‌.. చాలావరకూ ముఖం పొడిగా అయ్యాకే ఏదైనా రాస్తుంటాం కదా! అలా చేయకూడదట. కొద్దిగా తడిపొడిగా ఉన్నప్పుడు రాస్తేనే మంచి ఫలితం అందుకోగలం. దీన్ని దూది ఉండపై తీసుకుని మెడ నుంచి ముఖానికి కింది నుంచి పైకి రాయాలి.

* మాయిశ్చరైజర్‌, ఐక్రీమ్‌.. బఠాణి గింజంత తీసుకుంటే సరిపోతుంది. చుక్కల్లా పెట్టుకొని ముఖమంతా కలిసేలా రాసుకోవచ్చు. అయితే దీన్ని అరచేత్తో రుద్దకూడదట. మునివేళ్లతో మర్దనా చేస్తున్నట్లుగా కింది నుంచి పైకీ, పక్కలకీ పరచుకునేలా రాయాలి. ఐక్రీమ్‌ విషయంలోనూ వేళ్లతోనే రుద్దడం కంటే అంటించినట్లుగా చేయడం మంచిదట

* సీరంనూ ఉపయోగిస్తుంటే.. నూనె తరహాదైతే మర్దనా చేస్తున్నట్లుగా, క్రీమ్‌దైతే అరచేతిలో రాసుకుని ముఖానికి అద్దినట్లుగా చేయాలి.

* సన్‌స్క్రీన్‌.. చర్మంలోకి ఇంకేలా కాదు... పూతలా మాత్రమే రాయాలి. ముఖంపై చేత్తో రాస్తూ వెళితే చాలు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని