కురులకు లవంగం!

లవంగం అనగానే బిర్యానీ, మసాలా కూరలు... గుర్తొస్తున్నాయా? కేశాలకు సంబంధించి ఏవైనా సమస్యలున్నా.. ఇక నుంచి దీన్ని ఆశ్రయించేయండి. ఎందుకంటే..

Updated : 27 Feb 2022 05:30 IST

లవంగం అనగానే బిర్యానీ, మసాలా కూరలు... గుర్తొస్తున్నాయా? కేశాలకు సంబంధించి ఏవైనా సమస్యలున్నా.. ఇక నుంచి దీన్ని ఆశ్రయించేయండి. ఎందుకంటే..

* వీటిల్లో యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి కురులను త్వరగా పెరిగేలానే కాదు.. దృఢంగానూ చేస్తాయి. దీనిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలూ ఎక్కువే. జుట్టు పలచబడటం, చుండ్రు వంటి సమస్యలకు చెక్‌ పెట్టేస్తుంది.

దీనిలో ఉండే విటమిన్‌ కె మాడుపై రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా వెంట్రుకలు రాలకుండా సాయపడుతుంది. జుట్టు త్వరగా తెల్లబడకుండానూ నిరోధిస్తుంది.

* లవంగ నూనెలో ఎజినాల్‌ అనే మూలకం ఉంటుంది. దీన్ని మాడుకు పట్టిస్తే కుదుళ్లు బలపడటమే కాక జుట్టుకు మెరుపూ అందుతుంది. ఇలా వాడొచ్చు.. రెండు కప్పుల నీటిని మరిగించి దానిలో 10 లవంగాలు, గుప్పెడు కరివేపాకును కచ్చాపచ్చాగా దంచి వేయండి. మరిగాక దించి, చల్లార్చి వడపోసి పక్కన పెట్టుకోండి. తలస్నానం పూర్తయ్యాక ఆఖర్లో ఈ నీటితో మాడును కడిగితే సరి. ఒకసారి చేసి ఫ్రిజ్‌లో పెట్టుకుంటే వారంపాటు పనికొస్తుంది. దీనిలో ఉండే యాంటీ సెప్టిక్‌, యాంటీ ఫంగల్‌ గుణాలు తలపై చర్మం పొడిబారడం తద్వారా వచ్చే దురద నుంచి కాపాడుతుంది. కరివేపాకు తేమనందించడంతోపాటు మృతకణాలనీ తొలగిస్తుంది. బీటా కెరోటిన్‌ కుదుళ్లకు పోషకాలనిస్తుంది. వారానికి కనీసం రెండుసార్లు ప్రయత్నిస్తే ఫలితం మీకే తెలుస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్