నగలు ధరించేటప్పుడు...

వేసవిలో నగల ఎంపిక విషయంలో జాగ్రత్త తీసుకోవాలంటున్నారు నిపుణులు. సమయం, సందర్భాలకు తగినట్లుగా ధరించాలని సూచిస్తున్నారు. లేదంటే అలర్జీలొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వేసవిలో సాధారణంగా పార్టీలు, శుభకార్యాలు, పర్యటనలకు ఎక్కువగా వెళ్తుంటారు. టూర్స్‌కు వీలైనంత సాధారణంగా అనిపించే మినిమల్‌ జ్యూవెలరీని ఎంపిక చేసుకోవాలి. పెళ్లిళ్లకు ప్రయాణంలో తేలికైనవి...

Published : 10 May 2022 01:32 IST

వేసవిలో నగల ఎంపిక విషయంలో జాగ్రత్త తీసుకోవాలంటున్నారు నిపుణులు. సమయం, సందర్భాలకు తగినట్లుగా ధరించాలని సూచిస్తున్నారు. లేదంటే అలర్జీలొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

వేసవిలో సాధారణంగా పార్టీలు, శుభకార్యాలు, పర్యటనలకు ఎక్కువగా వెళ్తుంటారు. టూర్స్‌కు వీలైనంత సాధారణంగా అనిపించే మినిమల్‌ జ్యూవెలరీని ఎంపిక చేసుకోవాలి. పెళ్లిళ్లకు ప్రయాణంలో తేలికైనవి ఎంచుకొని, వివాహ సమయంలో గ్రాండ్‌గా ఉన్నవి కాసేపు ధరించి తీసి భద్రపరచాలి. బంగారం కాకుండా వేరే లోహాలతో చేసినవి కొనాలనుకుంటున్నారా? అయితే వాటితో అలర్జీలొచ్చే అవకాశం ఉంటుందన్నది గుర్తు పెట్టుకోవాలి.

అందంతోపాటు..

నగలు అందాన్ని పెంచొచ్చు. అయితే వీటిని ధరించడం ద్వారా చర్మానికి హాని కలగకూడదు. తక్కువ ధరకు వచ్చే నకిలీ నగలు చూడటానికి ఆకర్షణీయంగా ఉండొచ్చు. అయితే వీటివల్ల చర్మంపై దురద, మంట, మచ్చలు వంటి ఇంకేవైనా ఎలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది. ప్లేటెడ్‌ బ్రాస్‌, కాపర్‌ వంటివి కొందరికి పడక పోవచ్చు. వీటిని ధరించాక చెమటతో తడిసి చర్మంపై ప్రభావం చూపిస్తాయి. కొన్ని సార్లు వీటివల్ల వచ్చే మచ్చలు చాలాకాలం బాధిస్తాయి. అలాకాకుండా స్టెర్లింగ్‌ సిల్వర్‌ లేదా బంగారం, ముత్యాల నగలు చూడటానికి హుందాగా ఉంటాయి. అలాగే చర్మంపై ఎటువంటి ప్రభావాన్నీ చూపవు.

జాగ్రత్తలు..

వేసవిలో నగలను ధరించిన తర్వాత సరైన రీతిలో భద్ర పరచకపోతే మురికిపట్టడం, నల్లబడటం జరుగుతాయి. కళాహీనంగా కనిపిస్తాయి. బయటికి వెళ్లి వచ్చిన తర్వాత బంగారం, వజ్రాలు, వెండి, ముత్యాల నగలను కాసేపు గాలికి ఆరనివ్వాలి. ఆ తర్వాత మెత్తని వస్త్రంలో విడివిడిగా చుట్టి చెక్క లేదా గాజు బాక్సులో భద్రపరిస్తే సహజ కళను కోల్పోవు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్