చినుకుల్లో సౌకర్యంగా...

వానాకాలానికి తగినట్లు దుస్తులు ధరించకపోతే రోజంతా అసౌకర్యాన్ని భరించాల్సిందే అంటున్నారు ఫ్యాషన్‌ నిపుణులు. వేటిని ఎంచుకుంటే మేలో సూచిస్తున్నారు.  కాటన్‌, జార్జెట్‌, చేనేత, రేయాన్‌ రకాలు వర్షాకాలంలో

Published : 23 Jul 2022 01:28 IST

వానాకాలానికి తగినట్లు దుస్తులు ధరించకపోతే రోజంతా అసౌకర్యాన్ని భరించాల్సిందే అంటున్నారు ఫ్యాషన్‌ నిపుణులు. వేటిని ఎంచుకుంటే మేలో సూచిస్తున్నారు. 

కాటన్‌, జార్జెట్‌, చేనేత, రేయాన్‌ రకాలు వర్షాకాలంలో ధరించడానికి అనువుగా ఉంటాయి. తేలికగా, తడిచినా త్వరగా ఆరేలా రేయాన్‌ టాప్స్‌ ఎంచుకోవాలి. కాటన్‌ టీ షర్ట్‌పై కాటన్‌ ప్యాంట్‌ లేదా కుర్తా, లెగ్గింగ్స్‌ వంటివి సౌకర్యాన్ని అందిస్తాయి. చేనేత వస్త్రాలు శరీరానికి సౌకర్యంగా ఉండటమే కాదు, తడిచినా తేలికగా ఆరిపోతాయి. వర్క్‌ప్లేస్‌కు తగ్గ హుందాతనాన్నీ అందిస్తాయి. రేయాన్‌ తేలికైన వస్త్రం, లాంగ్‌ స్కర్ట్‌లా ధరించొచ్చు. దీనిపై డెనిమ్‌ జాకెట్‌ సరైన ఎంపిక. జార్జెట్‌ వస్త్రాలు తేలిగ్గా ఉంటాయి. త్వరగా ఆరతాయి కూడా.

ఆహ్లాదంగా..

కాంతివంతమైన వర్ణాల దుస్తులు మనసును ఆహ్లాదంగా ఉంచుతాయి. పసుపు, నియాన్‌ గ్రీన్‌ వంటి లేతవర్ణాల దుస్తులకు ఈ సీజన్‌లో వార్డ్‌రోబ్‌లో స్థానమివ్వాలి. తెలుపు వర్ణానికి వీలైనంత దూరంగా ఉంటే మంచిది. లేదంటే ఈ కాలంలో మురికి, మరకలు పడితే అవి శాశ్వతంగా ఉండిపోయే ప్రమాదం ఉంది.

ఆభరణాల ఎంపిక కూడా సింపుల్‌గా ఉంటే మంచిది. ఫ్యాన్సీ నగలు, వాచీలు వాటర్‌ ప్రూఫ్‌వి అయితే మంచిది. తక్కువ నగలకు ప్రాధాన్యమివ్వాలి. పూసల బ్రాస్‌లెట్స్‌, పొడవైన జుంకాలు నప్పుతాయి. పూర్తిగా మెటాలిక్‌ జ్యువెల్లరీకి దూరంగా ఉండటం మంచిది.

పాదరక్షలు.. 

నడవడానికి సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. వాటర్‌ ఫ్రెండ్లీ ఫ్లిప్‌-ఫ్లాప్స్‌ వంటివి ఆరడానికి ఎక్కువ సమయం తీసుకోవు. స్పోర్ట్స్‌, లెదర్‌ షూలు, స్నీకర్స్‌ వంటివాటికి దూరంగా ఉండటం మేలు. ఇవి తడిస్తే ఆరడానికి చాలా సమయం తీసుకుంటాయి.

వాటర్‌ప్రూఫ్‌ బ్యాక్‌ప్యాక్‌ ఉంటే అందులో గొడుగు, సన్‌స్క్రీన్‌, లిప్‌బామ్‌, ఇయర్‌ఫోన్స్‌ వంటివన్నీ భద్రపరుచుకోవచ్చు. అత్యవసరానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్