బేబీ హెయిర్‌ దాచేద్దాం!

వేడుకల్లో ప్రత్యేకంగా కనిపించాలని ఏ అమ్మాయి మాత్రం కోరుకోదు? కానీ కొందరిలో చిన్న చిన్న వెంట్రుకలు ఎక్కువగా ఉంటాయి. అవి అస్తమానూ బయటికొచ్చి జుట్టు చెరిగినట్టుగా కనిపిస్తుంటుంది.

Published : 17 Sep 2022 00:17 IST

వేడుకల్లో ప్రత్యేకంగా కనిపించాలని ఏ అమ్మాయి మాత్రం కోరుకోదు? కానీ కొందరిలో చిన్న చిన్న వెంట్రుకలు ఎక్కువగా ఉంటాయి. అవి అస్తమానూ బయటికొచ్చి జుట్టు చెరిగినట్టుగా కనిపిస్తుంటుంది. ఇక స్టైల్‌ చేసుకున్నా లాభమేముంది? ఈ సమస్యకు చెక్‌ పెట్టే మార్గాలు కావాలా...!

* వాడని టూత్‌ బ్రష్‌ లేదా మస్కారా బ్రష్‌ తీసుకోండి. నచ్చిన హెయిర్‌ స్టైల్‌ చేసుకున్నాక ఈ చిన్న వెంట్రుకలు కనిపించేచోట వీటితో మృదువుగా దువ్వండి. లోపలికి వెళ్లిపోతాయి. టూత్‌ బ్రష్‌ను ఉపయోగిస్తోంటే మాత్రం దాన్ని కాస్త తడిచేయాలి.

* ఈ చిన్న వెంట్రుకలు ఎప్పుడూ బయటికి వచ్చేస్తుంటాయి కదా! ఎండ వేడి, కాలుష్యం ప్రభావం మామూలు వాటితో పోలిస్తే వాటి మీద ఇంకాస్త ఎక్కువగా ఉంటుందట. దీంతో పొడిబారి బయటకు వచ్చేస్తుంటాయి. తల త్వరగా ఆరడానికి హెయిర్‌ డ్రైయర్‌ వాడుతుంటాం. దాన్నుంచి వచ్చే వేడిగాలి సమస్యను పెంచేస్తుంది. ఈసారి నుంచి కూల్‌ సెట్టింగ్‌లో తక్కువ, మధ్యమ స్థాయి వేగంతో ఆరబెట్టుకొని చూడండి. మీ బేబీ హెయిర్‌ చక్కగా మాట వింటుంది.

* కాస్త కొబ్బరి నూనె అద్దండి. తలంతా జిడ్డు అంటారా! లైట్‌వెయిట్‌ ఆయిల్స్‌ అని దొరుకుతున్నాయి. దాన్ని రెండు, మూడు చుక్కలు బేబీ హెయిర్‌ ఉన్నచోట రాస్తే సరి! ఆపై దువ్వితే.. సమస్య ఉండదు.

* ఈ తలనొప్పి అంతా మా వల్ల కాదు అనుకుంటే.. తలంతా కవర్‌ చేసేలా క్లిప్‌లు, హెడ్‌బ్యాండ్‌లు, హెయిర్‌ స్కార్ఫ్‌లు వస్తున్నాయి. చిన్న వెంట్రులను స్టైల్‌గా దాచేయొచ్చు. లుక్‌ కూడా బాగుంటుంది. లేదూ.. మెస్సీ బన్‌, మెస్సీ పోనీ టెయిల్‌ ప్రయత్నించవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్