ఎండిపోయినా వాడొచ్చు!

మేకప్‌కి సాధారణంగానే సమయం ఎక్కువ తీసుకుంటుంది. ఆ హడావుడిలో వాటిని జాగ్రత్త చేయడం మరిచిపోతుంటాం. దీంతో లిక్విడ్‌వి గడ్డకట్టేస్తుంటాయి.

Updated : 21 Oct 2022 04:35 IST

మేకప్‌కి సాధారణంగానే సమయం ఎక్కువ తీసుకుంటుంది. ఆ హడావుడిలో వాటిని జాగ్రత్త చేయడం మరిచిపోతుంటాం. దీంతో లిక్విడ్‌వి గడ్డకట్టేస్తుంటాయి. బోలెడు డబ్బులు పోసి కొన్నవి వృథా అవుతుంటే ప్రాణం ఉసూరుమంటుంది కదా! ఈ చిట్కాలు పాటించేయండి.

* మస్కారా.. వేడినీటిలో మునిగేలా మస్కారా ట్యూబ్‌ని కొద్దిసేపు ఉంచితే సరి. ఐడ్రాప్స్‌, కాంటాక్ట్‌ లెన్స్‌ సొల్యూషన్‌ కొన్ని చుక్కలు వేసి కదిపినా చాలు. లేదూ ఆలివ్‌, ఆల్మండ్‌, ఆముదం 2, 3 చుక్కలు కలిపి చూడండి. తాజా కలబంద గుజ్జును వేసి బాగా కదిపినా కరుగుతుంది. తిరిగి చక్కగా వాడేసుకోవచ్చు.

* లిప్‌స్టిక్‌.. తరచూ వేసుకోని వాళ్లే ఎక్కువ. కాబట్టి, ఎండిపోవడం సహజమే. వాడాలనుకున్నప్పుడు హెయిర్‌ డ్రైయర్‌ ముందు 5 నిమిషాలు ఉంచండి. కొబ్బరి నూనె 4-5 చుక్కలు వేసి కాసేపు పక్కన ఉంచినా వాడుకోవడానికి వీలుగా మారుతుంది. లిప్‌గ్లాస్‌ గడ్డకడితే వేడి నీటిలో ఉంచితే సరి.

* ఐలైనర్‌.. వేడినీటిలో కొద్దిచుక్కల గ్లిజరిన్‌ వేసి, ఐలైనర్‌ బ్రష్‌ని కొద్దిసేపు దానిలో ముంచండి. అది కరగడమే కాదు.. త్వరగా గడ్డకట్టదు కూడా. ఐలైనర్‌ బాటిల్‌లో కొన్నిచుక్కలు ఐడ్రాప్స్‌ వేసి, టూత్‌పిక్‌తో కలిపితే సరి. మళ్లీ వాడడానికి సిద్ధం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్