చెవిపోగులను పట్టించుకుంటున్నారా...!

అసలే ఎండాకాలం... చెమట, నూనె, దుమ్ము, ధూళీ వంటివి చేరి చెవిదిద్దులు రంగు మారిపోతుంటాయి. రోజూ పెట్టుకునే వీటిని శుభ్రపరిచే విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 

Published : 01 Mar 2023 00:05 IST

అసలే ఎండాకాలం... చెమట, నూనె, దుమ్ము, ధూళీ వంటివి చేరి చెవిదిద్దులు రంగు మారిపోతుంటాయి. రోజూ పెట్టుకునే వీటిని శుభ్రపరిచే విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే...

* బంగారం, వెండి వంటి లోహాలతో చేసిన చెవిపోగుల్ని రబ్బింగ్‌ ఆల్కహాల్‌తో శుభ్రం చేయొచ్చు. రెండు కప్పుల ఈ ద్రవాన్ని కప్పు వేడినీటిలో కలిపి అందులో చెవిపోగులను వేయాలి. ఇలా అరగంటసేపు వదిలేసి..మెత్తటి బ్రెష్‌తో రుద్దాలి. తర్వాత మంచినీటితో శుభ్రం చేసి మెత్తటి పొడి వస్త్రంతో తుడిస్తే తళతళలాడతాయి.

* చెవి దుద్దుల్ని శుభ్రపరచడానికి వెనిగర్‌ చక్కటి పరిష్కారం. కప్పు వేడినీటిలో రెండు టీ స్పూన్ల వెనిగర్‌, కొద్దిగా బ్లీచింగ్‌ కలిపి నానబెడితే రంగు మారినవి కొత్తవాటిలా మెరిసిపోతాయి.

* దుమ్మూధూళి చేరిన లోలాకులు నల్లగా మారితే... టూత్‌పేస్ట్‌పై కొంచెం బేకింగ్‌ సోడా చల్లి మృదువుగా రుద్దితే సరి కొత్తగా మెరిసిపోతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్