పోషకాహారంతో వ్యాధిపై పోరాటం...

రొమ్ము క్యాన్సర్‌ బాధితులు రోజూ ఆహారంలో పోషక విలువ లుండేలా జాగ్రత్తపడితే ఆ వ్యాధి నుంచి త్వరగా బయటపడొచ్చని చెబుతున్నారు వైద్యనిపుణులు. శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచి, రొమ్ముక్యాన్సర్‌తో పోరాడే శక్తిని పోషకాహారం అందిస్తుందంటున్నారు. ఆ ఆహారమేంటో కూడా సూచిస్తున్నారు.

Updated : 26 Oct 2021 05:42 IST

రొమ్ము క్యాన్సర్‌ బాధితులు రోజూ ఆహారంలో పోషక విలువ లుండేలా జాగ్రత్తపడితే ఆ వ్యాధి నుంచి త్వరగా బయటపడొచ్చని చెబుతున్నారు వైద్యనిపుణులు. శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచి, రొమ్ముక్యాన్సర్‌తో పోరాడే శక్తిని పోషకాహారం అందిస్తుందంటున్నారు. ఆ ఆహారమేంటో కూడా సూచిస్తున్నారు.

* వెల్లుల్లి.. వెల్లుల్లి రొమ్ము క్యాన్సర్‌తో పోరాడే శక్తిని శరీరానికి అందిస్తుంది. రోజూ ఆహారంలో వెల్లుల్లి ఉంటే మంచిది. కెరొటినాయిడ్స్‌ పుష్కలంగా ఉండే క్యారెట్‌, చిలకడ దుంప, బొప్పాయి, గుమ్మడి, టొమాటోలను ఎక్కువగా తీసుకోవాలి. వీటిలోని ఫైటో కెమికల్స్‌ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.

* క్యాబేజీ... బయో యాక్టివ్‌ కాంపౌండ్స్‌ ఉండే కూరగాయలైన క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌ వంటివి వ్యాధితో పోరాడే శక్తినిస్తాయి. పసుపులోని ఫైటో కెమికల్‌ రొమ్ము క్యాన్సర్‌ నుంచి తేలికగా బయటకు తెస్తుంది. అలాగే ఫ్లవనాయిడ్స్‌ ఉండే బ్లాక్‌ టీ, ఉల్లిపాయ వంటివి ఫ్రీరాడికల్స్‌తో పోరాడి, వ్యాధి నుంచి బయట పడటానికి సహకరిస్తాయి.

​​​​​​​* ఆవునెయ్యి... మంచి కొలెస్ట్రాల్‌ ఉన్న ఆవునెయ్యి, గింజ ధాన్యాలు, కొబ్బరి, వేరుశనగ, గుమ్మడి విత్తనాలు, నువ్వులను ఎక్కువగా తీసుకోవాలి. పీచు ఉండే గోధుమ, ముడిబియ్యం వంటి వాటికి ప్రాముఖ్యతనివ్వాలి. యాంటీ ఆక్సిడెంట్స్‌, ఒమేగా -3 అధికంగా ఉండే ఫ్లాక్స్‌ సీడ్స్‌లో ఆయుర్వేద గుణాలు మెండు. ఇవి అనారోగ్యాన్ని తగ్గించే కృషి చేస్తాయి.

​​​​​​​* సి విటమిన్‌... రొమ్ము క్యాన్సర్‌ బాధితులకు రెట్టింపు సి విటమిన్‌ కావాలి. ఉసిరి, జామ, నిమ్మ వంటి సి విటమిన్‌ ఉండే వాటిని ఎక్కువగా తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. సహజ ఎరువులతో పండించే కూరగాయలను తీసుకోవడం, నిలవ పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.

​​​​​​​* చక్కెరకు దూరం... తాజా పండ్లు, ఎండుఫలాల నుంచి అందే చక్కెర శాతం శరీరానికి సరిపోతుంది. సాధారణ చక్కెరకు పూర్తిగా దూరంగా ఉండాలి. ప్రాసెస్డ్‌ ఫుడ్‌, ప్యాకింగ్‌ చేసినవి, బాగా వేయించిన ఆహార పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ ఆహార నియమాలను పాటిస్తే శరీరానికి రొమ్ము క్యాన్సర్‌తో పోరాడే శక్తి అందుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్