బరువు తగ్గాలా...చెమట చిందాల్సిందే!

శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించుకోవడానికి ఆహారపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాస్త కష్టమూ పడాలి... అప్పుడే మంచి ఆరోగ్యమూ, చక్కని శరీరాకృతీ సొంతం అవుతుంది...

Updated : 06 Apr 2022 01:27 IST

శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించుకోవడానికి ఆహారపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాస్త కష్టమూ పడాలి... అప్పుడే మంచి ఆరోగ్యమూ, చక్కని శరీరాకృతీ సొంతం అవుతుంది...

కెలొరీల తగ్గింపు... తీసుకునే ఆహారంలో  అన్ని పదార్థాల నుంచి ఒకే మొత్తంలో కెలొరీలు లభ్యం కావు. కొన్నింటి నుంచి ఎక్కువ మొత్తంలో, మరికొన్నింటి నుంచి తక్కువ మొత్తంలో లభిస్తాయి. చక్కెర, కొవ్వు పదార్థాల నుంచి చాలా ఎక్కువ కెలొరీలు అందుతాయి. కాబట్టి రోజువారీ ఆహారంలో చక్కెర వాడకాన్ని బాగా తగ్గించుకోవాలి.

మేలైన మాంసకృత్తులు... ఎక్కువ మొత్తంలో మాంసకృత్తులను తీసుకోవాలి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఈ సూక్ష్మ పోషకాలు కండరాలను బలంగా మార్చడంతో పాటు కణాలను బాగు చేస్తాయి. ఎంజైమ్‌లు, హార్మోన్ల తయారీలో కీలకపాత్ర పోషిస్తాయి. కాబట్టి ప్రొటీన్లు ఉండే గుడ్లు, చేపలు, ఎండు ఫలాలను ఆహారంలో చేర్చుకోవాలి.

తాజా పండ్లు, కూరగాయలు... ఇవి బరువును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కొలెస్ట్రాల్‌ స్థాయులు, రక్తపోటును నియంత్రిస్తాయి. రోగనిరోధకతను పెంచుతాయి.  పండ్లు, కూరగాయల్లోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్‌ రాకుండా అడ్డుకుంటాయి. అయితే కేవలం వీటినే తింటూ బరువు తగ్గించాలని అనుకోకూడదు. మిగతా పదార్థాలతోనూ కలిపి తీసుకుంటే ప్రయోజనాలు అందుతాయి.

బరువులు ఎత్తడం... ఆహారంలో మార్పొక్కటే కాదు... వ్యాయామం సరిగా చేసినప్పుడే అధిక బరువును వదిలించుకోగలం. ఇందు కోసం వారంలో రెండు మూడు సార్లు కాస్త కష్టమైన వ్యాయామాలను ప్రయత్నించండి. వారంలో 3 నుంచి 5 రోజులు బరువులు ఎత్తే వర్కవుట్లను ప్రయత్నించండి.

* ఇవే కాకుండా రోజులో పదివేల అడుగులు నడవడం, ఎనిమిది గంటలు కంటి నిండా నిద్ర ఉంటే అదనపు బరువును సులువుగానే తగ్గొచ్చు. ప్రయత్నిస్తారా?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్