ఆకలి మందగించిందా...

మనలో చాలామంది పొద్దున్నే అల్పాహారం తీసుకోకుండా మధ్యాహ్నం ఒకేసారి భోజనం చేయడం పరిపాటి. ఇందుకు పని ఒత్తిడే కాక ఆకలి మందగించడం కూడా ఒక కారణం. కానీ ఇది అలవాటుగా మారితే అనేక జబ్బులు దాడిచేయొచ్చు. కపాలభాతి ప్రాణాయామం చేసినట్లయితే ఎంచక్కా ఆకలేసి ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. అంతేనా... దాంతో ఇంకెన్ని లాభాలున్నాయో చూడండి...

Published : 20 Aug 2022 00:32 IST

మనలో చాలామంది పొద్దున్నే అల్పాహారం తీసుకోకుండా మధ్యాహ్నం ఒకేసారి భోజనం చేయడం పరిపాటి. ఇందుకు పని ఒత్తిడే కాక ఆకలి మందగించడం కూడా ఒక కారణం. కానీ ఇది అలవాటుగా మారితే అనేక జబ్బులు దాడిచేయొచ్చు. కపాలభాతి ప్రాణాయామం చేసినట్లయితే ఎంచక్కా ఆకలేసి ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. అంతేనా... దాంతో ఇంకెన్ని లాభాలున్నాయో చూడండి...

కపాలభాతి ఇలా చేయాలి...

పద్మాసనం, వజ్రాసనం లేదా సుఖాసనంలో కళ్లు మూసుకుని కూర్చోవాలి. వెన్నెముక తిన్నగా ఉండాలి.

రెండుచేతులూ మోకాళ్ల మీద ఉంచి శ్వాస దీర్ఘంగా, బలంగా తీసుకోవాలి. ఆ సమయంలో పొట్ట మీద ఒత్తిడి కలిగిస్తూ నాభి వెన్నుభాగానికి తాకుతుందేమో అన్నట్టు లోనికి పంపాలి.

బలంగా ఊపిరి విడుస్తూ, అంతే వేగంగా శ్వాస తీసుకోవాలి. మొదట ఒకటి రెండుసార్లు మీరలా ప్రయత్నించి చేస్తే ఆనక మీ ప్రమేయం లేకుండానే జరిగిపోతుంది.
పొత్తికడుపును మీకు సాధ్యమైనంతగా లోనికి పంపండి.

20 సార్లు శ్వాస తీసుకుని, వదలడం అయ్యాక కళ్లు తెరవకుండా సేదతీరుతూ శరీరంలో సంవేదనలు గుర్తించండి. అలా మూడు దఫాలుగా చేయండి. ఇది చేస్తున్నప్పుడు ధ్యాసంతా పొత్తికడుపు మీదే ఉంచండి.

ప్రయోజనాలు

కొద్దినిమిషాలు దీర్ఘశ్వాస తీసుకోవడం వల్ల శరీరం సేదతీరుతుంది. మెదడులో అలజడులు, ఒత్తిళ్లు తగ్గుతాయి. నెమ్మదితనం అనుభూతికొస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నాడీవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. శారీరక, మానసిక దారుఢ్యం వస్తుంది. ఊపిరితిత్తులు బలపడతాయి. పొత్తికడుపు, ఉదరభాగంలోని అవయవాలు ఉత్తేజితమౌతాయి. రక్తసరఫరా సాఫీగా ఉంటుంది. ముఖానికి కాంతి వస్తుంది. జీర్ణప్రక్రియ మెరుగవుతుంది. పొట్ట తగ్గుతుంది.

ఎవరు చేయకూడదు...

గుండెజబ్బులు ఉన్నవాళ్లు, స్టెంట్‌ వేయించుకున్నవాళ్లు, గర్బిణులు, హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నవాళ్లు... నడుంనొప్పి, వెన్నుపూస చెదరడం, పొత్తికడుపులో శస్త్రచికిత్స, హెర్నియా, మూర్ఛవ్యాధి లాంటి సమస్యలున్నవాళ్లు ఇది చేయకూడదు. రుతుక్రమ సమయంలోనూ కూడదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్