ఒంటిని చల్లబరిచే నీళ్లివి..

ఎండ దెబ్బ తగిలితే... ఒళ్లంతా చెమటలు పట్టడం.. విపరీతంగా దాహం వేయడం, నిస్సత్తువ, తలనొప్పి... ఇలా ఒకటేమిటి... ఎన్నో ఇబ్బందులు కనిపిస్తుంటాయి. ఇలాంటప్పుడు ఈ నీళ్లను తాగి చూడండి.

Updated : 18 May 2023 09:49 IST

ఎండ దెబ్బ తగిలితే... ఒళ్లంతా చెమటలు పట్టడం.. విపరీతంగా దాహం వేయడం, నిస్సత్తువ, తలనొప్పి... ఇలా ఒకటేమిటి... ఎన్నో ఇబ్బందులు కనిపిస్తుంటాయి. ఇలాంటప్పుడు ఈ నీళ్లను తాగి చూడండి. దాహం తీరడమే కాదు.... ఇతరత్రా సమస్యలూ అదుపులోకి వస్తాయి.

* శక్తినిచ్చే కొబ్బరి... లేత కొబ్బరినీటిలో పొటాషియంతోపాటూ సోడియం.. ఇతర లవణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎండ వల్ల కోల్పోయిన పోషకాలను తిరిగి భర్తీ చేస్తాయి. కెలొరీలూ, పిండిపదార్థాలూ, కొవ్వు తక్కువగా ఉండటం వల్ల శరీరానికి తక్షణ శక్తీ అందుతుంది.

* మేలు చేసే మజ్జిగ: మజ్జిగ డీహైడ్రేషన్‌ని అదుపు చేస్తుంది. ఇందులోని క్యాల్షియం, బి విటమిన్లు శరీరం శక్తిని కోల్పోనివ్వవు. అందుకే, పల్చగా చేసిన చల్లలో కాస్త ఉప్పు, చిటికెడు వేయించిన వాము, చిన్న అల్లం ముక్క, రెండు నిమ్మ ఆకులు కూడా వేసి తాగితే సరి. ఇది ఎంతో రుచిగానూ ఉంటుంది.

* పోషకాల చెరకు: దాహంతో గొంతు ఎండిపోతున్నప్పుడు గ్లాసు చెరకురసం తాగితే చాలు. ఇందులోని ఎలక్ట్రోలైట్లు, మెగ్నీషియం, క్యాల్షియం శరీరానికి తక్షణ శక్తినిస్తాయి. వడ దెబ్బ బారిన పడకుండా ఇందులోని ఖనిజలవణాలు రక్షణగా ఉంటాయి. ఈ కాలంలో వచ్చే మూత్ర సంబంధిత సమస్యలకు చక్కటి పరిష్కారం.

* చల్లటి సబ్జా: ఈ వేసవిలో శరీర ఉష్ణోగ్రతల్ని చల్లబరచడానికి చక్కటి పరిష్కారం సబ్జా గింజలు. వీటిని నీళ్లల్లో వేసుకుని కాసేపు నాననిచ్చి తాగితే చాలు... శరీరం హాయిగా ఉంటుంది. దీన్ని రోజూ తాగడం వల్ల ప్రొటీన్‌తో పాటు ఇతరత్రా పోషకాలూ శరీరానికి అందుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్