అఫ్గాన్‌లో అలా... సౌదీలో ఇలా

అఫ్గాన్‌ పరిణామాలు ఆ దేశ మహిళలను తీవ్ర భయాందోళనలకు, ప్రపంచవ్యాప్త మహిళలను వేదనకు గురి చేస్తున్నాయి. అదే సమయంలో మరో ముస్లిం దేశమైన సౌదీ అరేబియా మాత్రం మహిళల

Updated : 27 Aug 2021 00:39 IST

అఫ్గాన్‌ పరిణామాలు ఆ దేశ మహిళలను తీవ్ర భయాందోళనలకు, ప్రపంచవ్యాప్త మహిళలను వేదనకు గురి చేస్తున్నాయి. అదే సమయంలో మరో ముస్లిం దేశమైన సౌదీ అరేబియా మాత్రం మహిళల సాధికారత దిశగా అడుగులు వేస్తోంది.

సౌదీ అరేబియాలో అతిముఖ్యమైనవి గ్రాండ్‌, ప్రవక్త మసీదులు. వీటి నిర్వహణలో మహిళలను భాగస్వాములుగా చేస్తున్నట్లు ఆ మసీదుల జనరల్‌ ప్రెసిడెన్సీ అధ్యక్షుడు డాక్టర్‌ అబ్దుల్‌ రహ్మాన్‌ బిన్‌ అబ్దులాజీజ్‌ అల్‌-సుదైస్‌ ప్రకటించారు. ఈ చర్య సౌదీ అరేబియాలో మహిళా సాధికారత దిశగా వేస్తున్న అడుగుగా అభివర్ణించారు. ఎంపికైన వారంతా మాస్టర్స్‌, డాక్టోరల్‌ డిగ్రీలు కలిగిన వారే. వీళ్లంతా జనరల్‌ ప్రెసిడెంట్‌కు అసిస్టెంట్లు, అడ్వైజర్లు, డిప్యూటీ ప్రెసిడెంట్లు తదితర ఉన్నత హోదాల్లో నియమితులయ్యారు. ఆ దేశ చరిత్రలో ఇంత సంఖ్యలో మహిళలను నాయకత్వ హోదాల్లో నియమించడం ఇదే మొదటిసారి. ఈ మహిళలు వివిధ రంగాల్లో సమర్థులని నిరూపితమయ్యాకే ఎంచుకున్నామని అల్‌ సుదైస్‌ చెప్పారు. 2030కల్లా హజ్‌, ఉమ్రా యాత్రికులు, సందర్శకుల సేవలో మహిళలకూ అవకాశం కల్పించనున్నారు. అంతేకాదు... చరిత్రలోనే మొదటిసారిగా మహిళలకు మహ్రమ్‌ (సంరక్షకుడు) లేకుండా హజ్‌ చేయడానికీ అనుమతిచ్చారు.  గత ఏడాదీ రెస్టారెంట్లు, కేఫ్‌ల ప్రవేశ ద్వారం వద్ద లింగ విభజనకూ ముగింపు పలికారు. మగవాళ్ల తోడు లేకుండానే ఆడవాళ్లకు కార్లను నడిపే, దేశం దాటి ప్రయాణించే వీలూ కల్పిస్తోంది సౌదీ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్