మీ సంస్కారానికి వందనాలు!

సేవకు వయసుతో సంబంధం లేదు, బాధ్యతకు లింగ భేదం లేదంటున్నారీ అమ్మాయిలూ, మహిళలూ. ఖమ్మంలోని సామాజిక సేవకులు డా.అన్నం శ్రీనివాసరావు సేవలతో స్ఫూర్తి పొందిన వీళ్లు... ఆయన స్థాపించిన ఫౌండేషన్‌ చేపట్టే సేవా కార్యక్రమాల్లో భాగమవుతున్నారు.

Published : 08 Mar 2022 01:18 IST

సేవకు వయసుతో సంబంధం లేదు, బాధ్యతకు లింగ భేదం లేదంటున్నారీ అమ్మాయిలూ, మహిళలూ. ఖమ్మంలోని సామాజిక సేవకులు డా.అన్నం శ్రీనివాసరావు సేవలతో స్ఫూర్తి పొందిన వీళ్లు... ఆయన స్థాపించిన ఫౌండేషన్‌ చేపట్టే సేవా కార్యక్రమాల్లో భాగమవుతున్నారు. కాలువలూ, కుంటల్లో పడి, రైలు ప్రమాదాల్లో చనిపోయినవారికీ, కరోనాతో మరణించిన వారికీ అంత్యక్రియలు చేస్తున్నారు. అర్ధరాత్రి, అపరాత్రి అని తేడా లేకుండా ఎప్పుడు ఫోన్‌ వచ్చినా వెళ్లి... కుళ్లిన, ఒళ్లు గగుర్పాటు కల్గించేలా ఛిద్రమైన శవాలను సైతం జిల్లా కేంద్ర ఆస్పత్రికి చేరుస్తారు. శవ పరీక్ష అనంతరం అంతిమ సంస్కారాలూ పూర్తి చేస్తారు హాలకి ఈశ్వరమ్మ, తైలం సరస్వతి, రాయపూడి ఉమ, హాలకి అనూష, బత్తుల దేవిశ్రీ. మతిస్థిమితం కోల్పోయి అన్నం ఫౌండేషన్‌ అనాథాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న మహిళలకూ అన్నీ తామై సపర్యలు చేస్తుంటారీ మానవతామూర్తులు.  

 

ఫొటోలు: కంది శివప్రసాద్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్