బాధను వీడి.. సంతోషంగా!

..ఫొమో, జాలో.. ఏంటీ కొత్తపదాలు అని చూస్తున్నారా? సోషల్‌ మీడియాలో విహరించే వారికి మాత్రం ఇవి పరిచయ పదాలే. యువత అనుసరిస్తున్న ఈ మంత్రాలు మనకూ ఆచరణీయ సూత్రాలే! అసలివేంటో.. పాటించే విధానాలేంటో.. చదివేయండి. పిల్లలకు వండిపెట్టడం, ఆయనకు కావాల్సినవి సమకూర్చడం.. ఉద్యోగినులైతే సెలవు దొరికినా ఇల్లు దులపడం, ఇంట్లోకి కావాల్సినవంటూ మరింత

Published : 10 Sep 2022 00:29 IST

..ఫొమో, జాలో.. ఏంటీ కొత్తపదాలు అని చూస్తున్నారా? సోషల్‌ మీడియాలో విహరించే వారికి మాత్రం ఇవి పరిచయ పదాలే. యువత అనుసరిస్తున్న ఈ మంత్రాలు మనకూ ఆచరణీయ సూత్రాలే! అసలివేంటో.. పాటించే విధానాలేంటో.. చదివేయండి.

పిల్లలకు వండిపెట్టడం, ఆయనకు కావాల్సినవి సమకూర్చడం.. ఉద్యోగినులైతే సెలవు దొరికినా ఇల్లు దులపడం, ఇంట్లోకి కావాల్సినవంటూ మరింత బిజీ అయిపోవడం. ఆ సమయంలో మన స్నేహితులెవరైనా విహారయాత్రకి వెళ్లామనో, స్నేహితులతో ఎంజాయ్‌ చేస్తున్నామనో ఇన్‌స్టాలో ఫొటోనో, వాట్సాప్‌లో స్టేటస్సో పెట్టారనుకోండి. ‘వాళ్లెంత ఆనందంగా ఉన్నారో.. నాకు మాత్రం ఎప్పుడూ పనే’ అనిపిస్తుంది కదూ. కాలేజీ అమ్మాయిల్నే తీసుకోండి. స్నేహితురాలి దగ్గర ఖరీదైనవి ఉన్నాయనో, తను అందంగా ఉంది.. నేనలా లేననో బాధపడుతుంటారు. ప్రతిదాన్నీ పక్కవాళ్లతో పోల్చుకొని బాధ పడటమన్నమాట. దీన్నే ‘ఫియర్‌ ఆఫ్‌ మిస్సింగ్‌ అవుట్‌’.. సంక్షిప్తంగా ‘ఫొమో’గా పిలుస్తున్నారు.

దీనికి వ్యతిరేకం.. జాలో! అంటే.. జాయ్‌ ఆఫ్‌ లెట్టింగ్‌ గో! నరకం లాంటి బంధంలో కొనసాగుతున్నారు.. ఎవరేమనుకుంటారోనని భరిస్తూ ఉండక దాన్నుంచి బయటపడటం.. నచ్చని ఉద్యోగం.. ‘ఏం చేస్తాం.. తప్పదు’ అంటూ సర్దుకుపోక వదిలేయడం లాంటి వన్న మాట. దీని పరమార్థం ఒక్కటే! ఉన్నది ఒక్కటే జీవితం. రోజూ సంతోషంగా గడిపేయడం, మనకు ముఖ్యమైందేదో తెలుసుకోవడం, నచ్చింది చేసుకుంటూ వెళ్లడం.

నిజానికి ఫొమోలోనూ సానుకూలతను చూడొచ్చంటారు నిపుణులు. స్నేహితురాలు ఆనందంగా గడిపేస్తోంది సరే! దాన్ని చూసి బాధపడక ఆ క్షణాన్ని నేనూ ఎలా సంతోషంగా మలచుకోవచ్చు అని ఆలోచించొచ్చు. లేదూ.. తనలా జీవితాన్ని అనుభవించేలా నా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవాలని మరింత కష్టపడొచ్చు. తను సన్నగా ఉంటే మీరూ వ్యాయామంపై దృష్టిపెట్టడం, లుక్‌ని మార్చుకోవడం, తన స్ఫూర్తితో కొత్తవి ప్రయత్నించొచ్చు. జీవితంలో ఆలోచించని లేదా వాయిదా వేస్తున్న వాటిని ప్రయత్నించేయొచ్చు. బాగున్నాయి కదూ ఈ సూత్రాలు!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని