వంట గది శుభ్రతే.. ఆరోగ్యం!

ఇంటిల్లిపాదీ ఏ అనారోగ్యం లేకుండా హాయిగా ఉండాలనేదే కదా మన కోరిక! కానీ మనం ఎక్కువగా ఉపయోగించే వంటగది నుంచే జబ్బుల వ్యాప్తి జరుగుతుందంటున్నారు నిపుణులు. దాని శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టమంటున్నారు. ఎలాగంటే..

Published : 04 Oct 2021 01:20 IST

ఇంటిల్లిపాదీ ఏ అనారోగ్యం లేకుండా హాయిగా ఉండాలనేదే కదా మన కోరిక! కానీ మనం ఎక్కువగా ఉపయోగించే వంటగది నుంచే జబ్బుల వ్యాప్తి జరుగుతుందంటున్నారు నిపుణులు. దాని శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టమంటున్నారు. ఎలాగంటే..

* వంటగదిలో సింకుకు మించిన అనారోగ్యకారకం మరోటి ఉండదట. కూరగాయలు కడగడం నుంచి పాత్రలు శుభ్రం చేయడం వరకూ ఇక్కడే. కాబట్టి, బ్యాక్టీరియా ఎక్కువగా చేరుతుంది. అందుకే ఎప్పటికప్పుడు దీన్ని ఉప్పు నీరు, సర్ఫ్‌ వంటి వాటితో శుభ్రం చేయాలి.

* కూరగాయలు, మాంసం కడిగే ముందు, తర్వాతా చేతులతోనే తాకుతాం. అంటే.. క్రిముల వ్యాప్తిలో చేతులదే ప్రధాన పాత్ర. కాబట్టి, ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూనే ఉండాలి. ఫ్రిజ్‌, ట్యాప్‌ హ్యాండిల్స్‌ను ముట్టుకుంటుంటాం. వీటినీ తరచూ తుడుస్తుండాలి.

* ఇ-కొలీ వస్త్రాలపై 48 గంటల వరకూ సూక్ష్మజీవులు జీవించి ఉండగలవు. కాబట్టి, వంటగదిలో వాడే వస్త్రాలు, స్పాంజి వంటి వాటిని యాంటీ మైక్రోబియల్‌ లిక్విడ్‌ కలిపిన నీటిలో కొంతసేపు నానబెట్టి ఉతకడం మంచిది.

అలాగే.. కిచెన్‌ కోసం శుభ్రం, డిస్‌ఇన్‌ఫెక్షన్‌ రెండూ చేయగల ఉత్పత్తులను ఎంచుకోండి.  ప్రత్యేకంగా సింకు వద్ద హ్యాండ్‌వాష్‌ను ఉంచుకోవాలి. వంట పూర్తయ్యాక ఎప్పటికప్పుడూ స్టవ్‌తోపాటు దానికింద, చుట్టుపక్కల ప్రదేశాలను వేడినీటిలో, నిమ్మకాయ, డిష్‌వాష్‌ కలిపిన మిశ్రమంతో శుభ్రం చేసుకుంటుంటే.. కుటుంబాన్ని జబ్బులకు దూరంగా ఉంచగలుగుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్