వారెవ్వా ఎంత సులువు!

చాలామందికి ఎక్కువ సమయం వంటగదిలోనే అయిపోతుంది. ఇలాంటప్పుడు ఈ చిట్కాలు పాటించి చూడండి.

Updated : 17 Oct 2021 06:44 IST

చాలామందికి ఎక్కువ సమయం వంటగదిలోనే అయిపోతుంది. ఇలాంటప్పుడు ఈ చిట్కాలు పాటించి చూడండి.

* కూర, చారు, పచ్చడి.. ఇలా ప్రతి దాంట్లో టొమాటోలు ఉండాల్సిందే కదూ! ఇవి కొంచెం ఎక్కువ కొనుక్కొస్తే పాడైపోతాయి, తక్కువ తెస్తే అవసరానికి ఉండవు. మరి దీనికి విరుగుడేంటంటే.. పెద్ద మొత్తంలో గ్రైండ్‌ చేసి తగినంత పసుపు, ఉప్పు వేసి ఉడికించి గాలి చేరని గాజు సీసాల్లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచండి. రెండుమూడు చెంచాల చొప్పున తేలిగ్గా వాడుకోవచ్చు.పచ్చిగా ఉన్న పండ్లను అవెన్‌లో అరనిమిషం వేడి చేస్తే చాలు త్వరగా పక్వానికొచ్చేస్తాయి.

* నిమ్మరసాన్ని తడి లేని సీసాలో పోసి పసుపు, ఉప్పు కలిపి ఫ్రిజ్‌లో ఉంచితే చాన్నాళ్లు నిలవుంటుంది. వంటల్లో సులువుగా వాడుకోవచ్చు.

*పచ్చి బంగాళా దుంపలను పీలర్‌తో చెక్కు తీయడం కొంచెం కష్టం. అందుకు భిన్నంగా కాసేపు ఉడికించి, చల్లటి నీళ్లలో వేస్తే పొట్టు ఇట్టే తీసేయొచ్చు.

* ఉల్లిపాయలు కోస్తోంటే ఆ ఘాటుకు కళ్లు మండి చిరాకొస్తుంది. కోసేముందు కాసేపు వాటిని ఫ్రిజ్‌లో ఉంచితే ఆ బాధ ఉండదు.

* ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ లాంటివి ఫ్రీజర్‌లోంచి తీసి వెంటనే మూకుట్లో వేస్తే వాటికున్న ఐసు నూనెలో పడి చిందుతుంది. అలా కాకుండా అవెన్‌లో కొన్ని క్షణాలుంచి ఆనక వేయిస్తే సరి.

*గుడ్లు పాడయ్యాయేమోనని సందేహం కలిగితే...నీళ్లల్లో వేయండి. మునిగితే మంచివి, తేలితే పనికిరావని అర్థం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్