దేనిలో వండుతున్నారు..
close
Published : 21/01/2022 00:41 IST

దేనిలో వండుతున్నారు..

ఇప్పుడు మనలో చాలామంది సంప్రదాయ వంట పాత్రలకు ప్రాధాన్యమిస్తున్నారు. రసాయనాలు లేని ఆహారాన్ని కుటుంబానికి అందించాలనే ఉద్దేశమే ఇందుకు కారణం. అయితే ఎంపిక తప్పు అవడం లేదు కదా!

* కాపర్‌ పాత్రల నుంచి నీరు, ఆహారం తీసుకోవడం చాలా మంచిదంటారు. అయితే ఎక్కువ వేడి మీద దీనిలో వంట చేసినా, నీరు కాచినా అది శరీరంపై దుష్ప్రభావాలను చూపుతుందట. ఉప్పు, కొన్ని రకాల కాయగూరల నుంచి విడుదలయ్యే ఆసిడ్లు ఇందుకు కారణమవుతాయట. కాబట్టి, వండిన వాటిని తీసి ఉంచుకోవడానికే ఉపయోగించుకునేలా చూసుకోండి.

* కుక్కర్‌, నాన్‌స్టిక్‌.. ఇలా చాలా రూపాల్లో అల్యూమినియం పాత్రలు దాదాపుగా ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. వీటిని వేడి చేసినప్పుడు టొమాటో, వెనిగర్‌, చింతపండుల్లోని ఆసిడ్‌లతో ఇది చర్యజరుపుతుంది. దీంతో ఆహారం విషతుల్యమవుతుందంటున్నారు నిపుణులు. దీంతో ఉబర సంబంధ సమస్యలతోపాటు అల్జీమర్స్‌కూ దారి తీస్తుంది. వీటి వాడకాన్ని వీలైనంత తగ్గించడం మేలు.

ఇవి మేలు

వేగంగా వేడిని గ్రహించి వంట త్వరగా పూర్తిచేయడంలో ఇనుప పాత్రలు సాయపడతాయి. ఎక్కువ వేడి ద్వారా ఆహారంలోకి చేరే ఐరన్‌ శరీరానికీ మేలు చేస్తుంది. జాగ్రత్తగా వండాలి, నిర్వహణా కష్టమని మట్టి పాత్రలను పక్కన పెట్టేస్తాం కానీ.. ఇవి కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే. పలుచగా కనిపిస్తూ, తక్కువ బరువుతో ఉండే స్టీల్‌ కూడా ఎలాంటి హానీ చేయవు.


Advertisement

మరిన్ని