అభిరుచికి సృజనాత్మకత అద్దితే...

నదుల దగ్గర, సముద్రతీరాల్లోనూ దొరికే అందమైన గులక రాళ్లను సేకరించడం కొందరికి అలవాటు. ఈ అభిరుచికి కాస్త సృజనాత్మకతను అద్దితే ఇంటి అలంకరణలో భాగంగా చేసుకోవచ్చు. అదెలాగంటే..

Updated : 15 May 2022 04:08 IST

నదుల దగ్గర, సముద్రతీరాల్లోనూ దొరికే అందమైన గులక రాళ్లను సేకరించడం కొందరికి అలవాటు. ఈ అభిరుచికి కాస్త సృజనాత్మకతను అద్దితే ఇంటి అలంకరణలో భాగంగా చేసుకోవచ్చు. అదెలాగంటే..

సేకరించిన రాళ్లు, గవ్వలు, శంఖాలు వంటివన్నింటినీ పరిమాణాన్ని బట్టి విడదీసుకోవాలి. ఆ తర్వాత ఏయే ఆకారాల్లో ఉన్నాయో గుర్తించాలి. వాటిని బట్టి మనసులో ఏదైనా ఓ చిత్రాన్ని ఊహించుకోవాలి. ఒక దళసరి కాగితాన్ని తీసుకొని దానిపై ఆ రాళ్లను వరుసగా పేర్చి జిగురుతో అతికించాలి. అది ప్రకృతి చిత్రం కావొచ్చు... కుటుంబమంతా ఓ కొండపై కూర్చుని వెన్నెలను ఆస్వాదిస్తున్నట్లు... ఇలా ఏదైనా అవ్వొచ్చు. రాళ్లను అతికించిన తర్వాత చిత్రానికి తగినట్లుగా ఎండు పుల్లలను చెట్లుగా అమర్చి అతికించాలి. ఈ కాగితాన్ని ఒక ఫ్రేంలో సర్దితే చాలు. అందమైన ఫొటోగా మారిపోతుంది. హాల్లోనో, పడక గదిలోనో గోడకు వేలాడదీసినా, బల్లపై ఉంచి పక్కగా చిన్న ఇండోర్‌ మొక్కనుంచినా చాలు. గదిలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇవి ఆత్మీయులకు కానుకగానూ ఇవ్వొచ్చు.

చిన్నారుల గదిలో.. పిల్లలతోనూ ఈ స్టోన్‌ ఆర్ట్‌ వర్క్‌ చేయించొచ్చు. జంతువులు, పక్షులు, నగలు వంటి ఆలోచనలు చెప్పి వాటికి తగినట్లుగా రాళ్లను ఎంపిక చేసుకోమనాలి. ఆ తర్వాత ఓ కొమ్మపై పిచ్చుకలు వాలి ఉన్నట్లు లేదా ఆకాశంలో పక్షులు ఎగురుతున్నట్లు కాగితంపై ఆ రాళ్లను అతికించేలా చేయాలి. అంతరిక్షంలో గ్రహాలను పోలిన రాళ్లను వారితోనే ఎంపిక చేయించి కాగితంపై సర్దించి అతికించమని చెప్పాలి. వీటిని విడివిడిగా ఫ్రేంల్లో ఇమిడేలా చేసి అన్నింటినీ వారి గదిలోనే గోడకు వేలాడదీయాలి. వారే సొంతంగా చేసిన బొమ్మలు కావడంతో మరిన్ని రకాలు చేయడానికి ఉత్సాహంగా ముందుకొస్తారు. వారి సృజనాత్మకతకూ మంచి వేదిక దొరుకుతుంది. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్