ఎండ అవసరం లేదు...
ఇండోర్ మొక్కలకు కూడా అప్పుడప్పుడు ఎండ అవసరమని ఆ తొట్టెలను బయట పెడుతుంటాం. అయితే పూర్తిగా ఎండ అవసరంలేని మొక్కలు కొన్ని ఉన్నాయి. ఇవి ఇంట్లోనే ఆరోగ్యంగా పెరుగుతాయి..
ఇండోర్ మొక్కలకు కూడా అప్పుడప్పుడు ఎండ అవసరమని ఆ తొట్టెలను బయట పెడుతుంటాం. అయితే పూర్తిగా ఎండ అవసరంలేని మొక్కలు కొన్ని ఉన్నాయి. ఇవి ఇంట్లోనే ఆరోగ్యంగా పెరుగుతాయి..
కాస్ట్ ఐరన్ ప్లాంట్.. గదిలో సహజసిద్ధమైన వెలుతురులోనే ఆరోగ్యంగా పెరుగుతుంది. అదనపు నీరు బయటకు పోయేలా ఉన్న తొట్టెలో ఉంచాలి. మట్టిని ఎక్కువ చెమ్మగా లేదా ఎండిపోయేలా కాకుండా తేమగా ఉండేలా జాగ్రత్తపడాలి. దళసరిగా, ముదురాకుపచ్చని రంగు ఆకులతో ఇంటికి అందాన్నిస్తుంది. అలంకరణ అంతగా లేని గదిలో ఈ మొక్కనుంచితే, ఆ ప్రాంతమంతా కళకళలాడుతుంది.
జెడ్‌జెడ్ ప్లాంట్.. గదిలో వేసే లైటు వెలుతురు ముదురాకుపచ్చని ఆకులతో ఆ ప్రాంతాన్నంతా అందంగా మార్చేస్తుంది. వారానికి రెండుమూడుసార్లు నీటిని అందిస్తే చాలు. మట్టి మొత్తం పొడారినా కూడా కొన్నిరోజులపాటు బతకగలుగుతుంది.
డ్రసినా.. ఇంట్లో ముందుగదికి మాత్రమే పరిమితం కాదిది. స్నానాలగది, వంటింట్లోనూ.. ఆరోగ్యంగా పెరుగుతుంది. ఎండతోపాటు నీటి అవసరం కూడా అంతగా ఉండదు. తొట్టెలో మట్టి రెండు మూడు అంగుళాల లోతువరకు ఎండిన తర్వాత నీటిని అందించాలి.
పీస్ లిల్లీ.. ఫ్లోరోసెంట్ లైట్‌లోనూ ఇది ఆరోగ్యంగా ఎదగగలదు. పూలతో గదికి అందానిస్తుంది. నీళ్లు ఎక్కువ కాకుండా తొట్టెలో మట్టి చెమ్మగా ఉండేలా చూస్తే చాలు. అదనపు నీరు బయటకు పోయేలా జాగ్రత్తపడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.