కొనసాగించాలంటే ఆన్‌లైన్‌ ఉందిగా!

పెళ్లి, కుటుంబ బాధ్యతల కారణంగా కెరియర్‌ను పక్కనపెట్టే ఆడవాళ్లే ఎక్కువ. ఇప్పుడు ఆన్‌లైన్‌ చదువులు చిన్నపిల్లలకూ తప్పనిసరైంది. ఈ విధానంలోనే మీరూ ప్రయత్నించండి. ఎందుకంటే..

Published : 09 Aug 2021 01:07 IST

పెళ్లి, కుటుంబ బాధ్యతల కారణంగా కెరియర్‌ను పక్కనపెట్టే ఆడవాళ్లే ఎక్కువ. ఇప్పుడు ఆన్‌లైన్‌ చదువులు చిన్నపిల్లలకూ తప్పనిసరైంది. ఈ విధానంలోనే మీరూ ప్రయత్నించండి. ఎందుకంటే..

* ఇక్కడ విశ్వవిద్యాలయాలు రూపొందించే కచ్చితమైన, తప్పనిసరి టైంటేబుల్స్‌ ఏం ఉండవు. కాబట్టి నచ్చిన సమయాన్ని మీరే ఎంచుకోవచ్చు.

* సంప్రదాయ విద్యతో పోలిస్తే ఆన్‌లైన్‌ విద్యకు అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఉచిత కోర్సులూ ఉంటాయి. పైగా జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థలు అందించే పరిజ్ఞానాన్ని పొందొచ్చు. ఆన్‌లైన్‌ చదువు అంటే చొరవ తీసుకోవడం లాంటిది. ఇది భవిష్యత్‌లో ఉద్యోగ సమయంలోనూ అదనపు విలువనిస్తుంది.

* కాలేజ్‌ అంటే స్నేహితులు, ఒకరికొకరు సాయపడం లాంటివి ఉంటాయి. ఇక్కడ ఉండదన్న భావన చాలామందిలో ఉంటుంది. ఇక్కడా..

ఆలోచనలను పంచుకోవడం, గ్రూప్‌ అసైన్‌మెంట్‌లుంటాయి. ఆన్‌లైన్‌ ట్యూటర్‌తోపాటు ఇతర విద్యార్థుల సాయమూ తీసుకోవచ్చు. ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ఫామ్‌లు, ఆన్‌లైన్‌ లైబ్రరీ, గత ప్రశ్నపత్రాలు, జర్నల్స్‌, ఇతర ఆన్‌లైన్‌ విద్యార్థులు, ఆన్‌లైన్‌ విద్యలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సదుపాయాలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. ఇంకో లాభం ఏంటంటే.. ఇతర రెగ్యులర్‌ విద్యార్థుల్లాగే మీరూ అదే డిగ్రీని, అంతే విలువ ఉన్నదాన్ని చేజిక్కించుకున్నవారవుతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్