Updated : 18/08/2021 05:45 IST

పోల్చుకుంటే... ఎదగలేరు!

మహిళలు ఎంత నిబద్ధతతో పని చేసినా కెరీర్‌ గ్రాఫ్‌లో పై మెట్టుకి చేరడంలో మాత్రం వెనకబడుతున్నారంటున్నాయి అధ్యయనాలు. దీనికి కారణాలనేకం... తరచి చూసుకుంటే సరిదిద్దుకునే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
* పక్కాగా... ఏ పని చేసినా స్పష్టత అవసరం. ఆలోచన వచ్చిందే తడవు మొదలుపెట్టేయొద్దు. నిర్ణయం తీసుకోవడంలో తడబాట్లూ తప్పే. కెరీర్‌లో అయినా జీవితంలో అయినా... అనుకున్న దానిపై కొంత పరిశోధన, అంచనా, ప్రణాళిక ఉన్నప్పుడు మీ దారిలో ఇబ్బందులు ఎదురుకావు.
* నిలబడాలి... అవకాశాల్ని అందుకోవడం, నిలబెట్టుకోవడం ప్రాథమికంగా మన చేతుల్లోనే ఉంటుంది. పోటీలో ఎందరున్నా... విజేతలయ్యేది కొందరే. గెలుపోటములు, పదోన్నతుల గురించి అతిగా ఆలోచించి పక్కదారి పట్టొద్దు. వందశాతం ప్రయత్నించండి. విఫలమైనా ఓటమి నేర్పిన పాఠాలతో మళ్లీ ప్రయత్నించండి.  
* పోల్చుకోవద్దు.... విజేతల్ని చూసి కుంగిపోవద్దు. వారి విజయంలో లోపాలు వెతకాలనుకోవడమూ సరికాదు. మీ నైపుణ్యాలకు ఎంత సానబెట్టుకోగలరో వాస్తవికంగా ఆలోచించి అడుగులేయండి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి