మీకు మీరే పోటీ...
కుటుంబ సభ్యుల నుంచి కొంచెం ప్రేమ, కాస్త గౌరవం.. మహిళలు ఆశించేవి ఇవే కదా! మరి మీ సంగతేంటి? మీపై మీకు ప్రేమ, గౌరవం ఉన్నాయా? ముందు మన గురించి మనం శ్రద్ధ తీసుకోవాలి.
కుటుంబ సభ్యుల నుంచి కొంచెం ప్రేమ, కాస్త గౌరవం.. మహిళలు ఆశించేవి ఇవే కదా! మరి మీ సంగతేంటి? మీపై మీకు ప్రేమ, గౌరవం ఉన్నాయా? ముందు మన గురించి మనం శ్రద్ధ తీసుకోవాలి. అప్పుడే సంతోషంగా సాగగలమంటున్నారు మానసిక నిపుణులు. ఇందుకు కొన్ని సూత్రాలు నిర్దేశించుకోమని సూచిస్తున్నారు..
* మీకు మంచి అనిపించింది చేయండి. ప్రతిదీ ఇతరులు ఆమోదించాలని ఆశించొద్దు. అన్నీ అందరికీ నచ్చాలని లేదు. అంతమాత్రాన మీ ఇష్టాలను వదిలేసుకోవడం న్యాయం కాదుగదా! మీకోసం మీరు కొంత సమయం కేటాయించుకోండి. అలాగే మీ ఆరోగ్యాన్నీ మీరే చూసుకోవాలి. ఇంటి పనులతోనే అలుపొచ్చేసింది, ఇక వ్యాయామం ఏం చేస్తానులే అనుకోవద్దు. రోజులో కొంతసేపైనా వ్యాయామం చేయండి.
* పనుల ఒత్తిడితో అలసటగా అనిపిస్తే కాసేపు పక్కన పెట్టేసి నచ్చిన సినిమానో, కార్యక్రమమో చూడండి. సేదతీరినట్లవుతుంది. ఎన్ని పనులున్నా కాసేపు ఏకాంతంగా గడపండి. మీ గురించి మీరు విశ్లేషించుకోండి. మీ వల్ల ఏదైనా పొరపాటు జరిగి వ్యధ చెందినా అవతలివారికి కారణం వివరించి, మరోసారి జాగ్రత్తగా ఉండండి, సరిపోతుంది.
* బంధువులను కలవడం, దూర ప్రాంతాలకు వెళ్లడం లాంటి కోరికలను సంవత్సరాల తరబడి వాయిదా వేయొద్దు. అలాంటివి జీవితంలో నిరాసక్తతని తప్పించి ఉత్తేజాన్ని నింపుతాయి.
* వారానికోసారి అయినా మీకు తెలిసిన ఆటలు ఆడండి. నైపుణ్యాలు లేవని వెనకడుగు వేయొద్దు. ఒలింపిక్స్‌లో పోటీ ఏం పడట్లేదుగా! ప్రయత్నించండి. సరదాగా ఉంటుంది. అలాగే.. ఎప్పుడూ ఏ విషయంలోనూ ఇతరులతో పోల్చుకోకండి. మీకు మీరే పోటీ, మీకు మీరే సాటి! అది గుర్తుంచుకోండి. సగం నిరాశ దూరమవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.