ఒత్తిడి దూరం కావాలా?

ఇంటిల్లపాది సంరక్షణతోపాటు కార్యాలయంలో పని భాగ్యలక్ష్మికి ఒత్తిడి, ఆందోళనను కలిగిస్తున్నాయి. ఇది పోనుపోనూ తీవ్రమవొచ్చు అంటున్నారు నిపుణులు. కాబట్టి..

Updated : 10 Jan 2022 01:28 IST

ఇంటిల్లపాది సంరక్షణతోపాటు కార్యాలయంలో పని భాగ్యలక్ష్మికి ఒత్తిడి, ఆందోళనను కలిగిస్తున్నాయి. ఇది పోనుపోనూ తీవ్రమవొచ్చు అంటున్నారు నిపుణులు. కాబట్టి..

* బొమ్మల డిజైన్స్‌ ఉన్న పుస్తకాలను తెప్పించుకోండి. వాటికి రంగులు నింపడానికి ప్రతిరోజు కొంత సమయం కేటాయించుకోండి. ఇది మనసుకు ప్రశాంతత, ఏకాగ్రతను అందిస్తుంది. వ్యతిరేక ఆలోచనలను దరి చేరనివ్వదు. దాంతో ఒత్తిడి దూరమవుతుంది.

* త్రికోణం, చతురస్రం.. ఇలా వివిధ కోణాలున్నవి ఎంచుకుంటే ఇంకా మంచిది. వీటిల్లో వేర్వేరు రంగులను నింపితే మెదడుకూ వ్యాయామం. చాలా ఏకాగ్రతతో చేస్తాం కాబట్టి, ఒత్తిడి మాయమవుతుంది. అలాగే ఆర్కిటెక్ట్‌ డిజైన్లలోని సూక్ష్మమైన చోట్ల రంగుల్ని అద్దడం సాధన చేయండి. ఇది మెదడును సానుకూలంగా ఆలోచించేలా చేస్తుంది.  పిల్లలతో పోటీపడే చేస్తే ఉత్సాహమూ పెరుగుతుంది.

* దిండ్ల గలీబులు, భోజనాల బల్లపై వేసే వస్త్రంపైనా ప్రయత్నించేయండి. ఇలా మనకోసం కేటాయించుకునే ఈ కొద్ది సమయం మానసికానందాన్ని ఇవ్వడమే కాదు, ఒత్తిడినీ దూరం చేస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్