Published : 25/04/2022 01:07 IST

ఆ ఆనందానికి ఈ ఆహారం!

పని ఒత్తిడి, యాంత్రిక జీవనం, అనారోగ్య సమస్యలు... కారణాలేవయినా దాంపత్య జీవితానికి కేటాయించాల్సిన సమయం తగ్గుతూ వస్తోంది. మనలోని ఆ స్తబ్ధతని పోగొట్టి సంతోషాలు నింపే శక్తి ఈ ఆహారానికి ఉందని అంటున్నారు నిపుణులు..]

దానిమ్మ: యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతోపాటు... జననేంద్రియాలకు రక్త సరఫరాని పెంచే సామర్థ్యం దానిమ్మకు ఉంది. అందుకే రోజూ గ్లాసు దానిమ్మ రసం తాగేవారిలో గుండె జబ్బులు తగ్గడంతోపాటు దాంపత్య జీవితంపై ఆసక్తి పెరుగుతుందని కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

పాలకూర: తక్కిన ఆకుకూరలతో పోలిస్తే దీంట్లో విటమిన్‌-ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది ‘సెక్స్‌ హార్మోన్ల’ను విడుదలకు సాయం చేస్తుంది. దీనిలోని మాంగనీస్‌ ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ విడుదలయ్యేట్టు చేసి సంతాన సాఫల్యత కలిగేట్టు చేస్తుంది.

స్ట్రాబెర్రీలు: పండ్లు ఏవైనా ఆరోగ్యానికి మంచివే. వాటిల్లో విటమిన్‌-సి పుష్కలంగా ఉండే స్ట్రాబెర్రీలు దాంపత్య జీవనం సజావుగా సాగడానికి మరికాస్త ఎక్కువ మేలు చేస్తాయట.

మిర్చి: నాలుకని సుర్రుమనిపించే మిర్చీలు... సంసారంలో మాత్రం మాధుర్యాన్ని నింపుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. పదార్థాల్లోని మిర్చీ ఘాటు లైంగిక జీవితం పట్ల ఆసక్తిని పెంచే ఎండార్ఫిన్ల విడుదలకు తోడ్పడుతుంది.

బ్లాక్‌ చాక్లెట్‌: దీనిలోని సెరటోనిన్‌ ఒత్తిడిని తగ్గించి, లైంగిక జీవితంలో సంతోషాలు నింపుతుంది.

వీటితోపాటు పుచ్చకాయ, ఎండుద్రాక్ష, తేనె వంటివి కూడా మేలు చేస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని