వంకర మెడే.. గుర్తింపైంది!

పుట్టుకతోనే నాకు మెడ వంకర. స్నేహితులే ఉండేవారు కాదు. నాన్న దౌత్యవేత్త. దీంతో ఎన్నో దేశాలు తిరిగాం.

Published : 30 Nov 2022 00:43 IST

అనుభవపాఠం

పుట్టుకతోనే నాకు మెడ వంకర. స్నేహితులే ఉండేవారు కాదు. నాన్న దౌత్యవేత్త. దీంతో ఎన్నో దేశాలు తిరిగాం. నా యాస, రూపు రేఖలు ప్రతిదాన్నీ వెక్కిరించేవారు. దానికితోడు అమ్మ చాలా అందంగా ఉంటుంది. తనతో నన్ను పోల్చి ఇంకా ఏడిపించేవారు. ఫలితంగా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయా. చదువయ్యాక ఇంటర్వ్యూకని వెళితే వరుసగా 7 తిరస్కరణలు. ఇక నేను బతికుండటం వృథా అనుకొని కిటికీలోంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. నా స్నేహితురాలి కారణంగా బతికిపోయా. సైకియాట్రిస్ట్‌ దగ్గర చికిత్స తీసుకున్నాక మార్పు వచ్చింది. ఉద్యోగానికీ ఎంపికయ్యాక నామీద నాకు నమ్మకం పెరిగింది. మన దేశానికి తిరిగొచ్చాక సొంత అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థని ప్రారంభించా. ఓసారి నా కథను పంచుకోమని ఓ కార్యక్రమం నుంచి పిలుపొచ్చింది. కంగారుపడుతూనే వెళ్లా. తీరా నా మానసిక సంఘర్షణను పంచుకున్నాక ఏదో భారం తీరిపోయిన అనుభూతి. అప్పట్నుంచి ధైర్యంగా పంచుకోవడం మొదలుపెట్టా. మెడ వంకర అమ్మాయిగానే గుర్తింపొచ్చింది. ఎంతో మందికి స్ఫూర్తిగానూ నిలిచా. వివక్ష మొదలయ్యేది మన మెదడులోనే! ఆడవాళ్లం రూపురేఖలు, ఎవరో ఏదో అంటున్నారనుకొని అనుక్షణం కంగారు పడుతుంటాం. సమాజమూ ఒకరకంగా ఇందుకు కారణమే! పోనీ ఊరుకున్నారని వదిలేస్తారా? అప్పుడూ ఏదో వంక వెతుకుతూనే ఉంటారు. ముందు మీరు వాటన్నింటినీ వదిలించుకోండి. ‘నేనూ సాధించగలను’ అని ధైర్యంగా ముందుకు సాగండి. మీ లోపమూ మీకు గుర్తింపవ్వగలదు.

- రాధిక గుప్తా, సీఈఓ, ఎడెల్‌వైస్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్