నిప్పుతో చెలగాటం వద్దన్నారు..

సైన్యంలో చేరి దేశసేవ చేయాలని చిన్నప్పటి నుంచీ కోరిక. మాది మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ స్కూల్లో వెనక బెంచీ విద్యార్థినినైనా.. క్రీడల్లో చురుగ్గా ఉండేదాన్ని.

Updated : 06 Dec 2022 06:06 IST

అనుభవ పాఠం

సైన్యంలో చేరి దేశసేవ చేయాలని చిన్నప్పటి నుంచీ కోరిక. మాది మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ స్కూల్లో వెనక బెంచీ విద్యార్థినినైనా.. క్రీడల్లో చురుగ్గా ఉండేదాన్ని. డిగ్రీలో ఎన్‌సీసీలో చేరి సేవలందించా. షిర్డీలో సిలిండర్‌ బ్లాస్ట్‌ సంఘటనలో రెస్క్యూ ఆపరేషన్‌కి వెళ్లినప్పుడు ఫైర్‌ ఫైటర్‌ అవ్వాలనిపించింది. నేషనల్‌ ఫైర్‌ సర్వీస్‌ కాలేజీలో చేరా. అమ్మా నాన్నలు ప్రోత్సహిస్తే, బంధువులు మాత్రం నిప్పుతో చెలగాటం ఆడొద్దు, ఆడపిల్లవు..ప్రమాదకరమైంది నీకెందుకన్నారు. అయినా నా కలనెవరూ ఆపలేకపోయారు. శిక్షణ కఠినంగా ఉన్నా.. ఇష్టంగా పూర్తిచేశా. దేశంలో తొలి మహిళా ఫైటర్‌నయ్యా. అగ్ని ప్రమాదాలు, వరదలు, భవనాలు కూలిపోవడం, నదులు పొంగడం, అటవీప్రాంతాల్లో వన్య ప్రాణుల దాడి వంటి విపత్తుల సహాయక చర్యల్లో పాల్గొన్నా. ఓఎన్‌జీసీలో సీనియర్‌ ఫైర్‌ ఆఫీసర్‌గా ముంబయి, కోల్‌కతా, దిల్లీ తదితర నగరాల్లో జరిగిన అగ్ని ప్రమాదాలెన్నింటిలోనో ప్రాణాలకు తెగించి ప్రజా రక్షణలో పాల్గొన్నా. పలు అవార్డులందుకొన్నా. నచ్చింది చేయడానికి ఆడ, మగ తేడా లేదు. మహిళంటేనే శక్తికి ప్రతీక. మన కలలను సాధించడానికి ఇది ఒకే ఒక్క జీవితం. మహిళలకు స్ఫూర్తిదాతవయ్యావని అమ్మానాన్న అంటుంటే.. గర్వంగా ఉంటుంది.

- హర్షిణి కన్హేకర్‌,దేశంలో తొలి మహిళా ఫైర్‌ఫైటర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్