Updated : 08/06/2021 04:28 IST

నా సంబంధాలను పట్టించుకోకంటాడు!

నా భర్త తనతో పనిచేసే మహిళలతో సంబంధాలు పెట్టుకున్నాడు. అడిగితే...అవన్నీ కామన్‌, నువ్వు పట్టించుకోకూడదంటాడు. ఈ విషయంలో మాకు చాలాసార్లే గొడవలయ్యాయి. పోట్లాడినప్పుడు తప్పయ్యింది అంటాడు. ఒక్కోసారి నాకే పాపం తెలీదంటాడు. ఇల్లు దాటితే మామూలే. చాలా విచిత్రంగా ఉంటుంది తన ప్రవర్తన. ఆయన్ని మార్చుకోవడం ఎలా?

- ఓ సోదరి, అహ్మదాబాద్‌

ద్యోగరీత్యా మనం కూడా ఎందరితోనో మాట్లాడతాం. కలిసి కాఫీ తాగుతాం. ఒక్కోసారి పనిమీద బయటకు వెళ్తాం. అన్నింటినీ తప్పు పట్టలేం. మీ భర్తకు వారితో సోషల్‌/ఎమోషనల్‌/సూపర్‌ఫిషియల్‌ రిలేషన్‌షిప్‌ ఏదైనా ఉండి ఉండొచ్చు. భార్యాభర్తల్లో ఒక్కరు చెప్పినదాన్ని బట్టి ఏది వాస్తవమో నిర్ణయించలేం. ఇద్దరితోనూ విడివిడిగా మాట్లాడి వారి వ్యక్తిత్వాలు, మానసిక స్థితి, వాళ్లమధ్య విభేదాల కారణాల వంటివన్నీ పరీక్షించాలి. వాళ్లు చెప్పే సంఘటనలను విని వాళ్ల సంబంధాన్ని అంచనా వేయాలి. చాలామంది రుజువులున్నాయంటూ వాళ్లిద్దరూ కలిసున్న ఫొటోనో, ఫ్లైట్‌లో కలిసెళ్లిన టికెట్లో చూపిస్తారు. అంతమాత్రాన సంబంధం ఉండదు. మీరనేదానికి అతనేం చెప్తాడో కూడా వినాలి. ఒక్కోసారి పదేపదే అడగడంవల్ల విసుగుతో అవునని చెప్పొచ్చు. లేదా అలాంటిదేమీ లేనందున ఏదో చెప్పి తప్పించుకోవచ్చు. ఎదిగిన పిల్లలుంటే వాళ్ల ద్వారా తల్లిదండ్రుల మధ్య జరుగుతున్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. విషయ సేకరణ అన్నమాట. మీ విషయంలో బలమైన రుజువులున్నాయంటున్నారు కాబట్టి నిజమే అయ్యుండొచ్చు. వ్యక్తిత్వలోపం లేదా మానసికస్థితి వల్ల అలా చేస్తోంటే సైకియాట్రిస్టు అతని బాధ్యతలు, ప్రవర్తించాల్సిన తీరు, మీతో అనుబంధం ఎలా ఉండాలో చెప్తారు. మీరతన్ని ఎలా అర్థం చేసుకోవాలి, మార్పు రావడానికేం చేయాలో కూడా చెప్తారు. ఇద్దరికీ మ్యారిటల్‌ థెరపీ, ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ ఇస్తారు. ఒకవేళ అవి చేసిన తర్వాత కూడా అతనిలో మార్పు రాకపోతే మీరు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించి న్యాయం పొందొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్