చెప్పలేక... తట్టుకోలేక...

నాకు పద్నాలుగేళ్లు. గత కొన్ని నెలలుగా ముఖంపై విపరీతంగా మొటిమలు. రంగు కూడా తగ్గా. అది చూసి మా ఫ్రెండ్స్‌ ఏడిపిస్తున్నారు. అందుకని క్రీములు రాస్తోంటే... ఇప్పట్నుంచే రాస్తే చర్మం పాడవుతుంది అని అమ్మ వాడనీయట్లేదు. తనకు చెప్పలేక, ఫ్రెండ్స్‌ టీజింగ్‌ తట్టుకోలేక ఏడుపొస్తోంది.

Published : 24 May 2024 13:32 IST

నాకు పద్నాలుగేళ్లు. గత కొన్ని నెలలుగా ముఖంపై విపరీతంగా మొటిమలు. రంగు కూడా తగ్గా. అది చూసి మా ఫ్రెండ్స్‌ ఏడిపిస్తున్నారు. అందుకని క్రీములు రాస్తోంటే... ఇప్పట్నుంచే రాస్తే చర్మం పాడవుతుంది అని అమ్మ వాడనీయట్లేదు. తనకు చెప్పలేక, ఫ్రెండ్స్‌ టీజింగ్‌ తట్టుకోలేక ఏడుపొస్తోంది. 

ఓ సోదరి

యుక్త వయసులో అందంగా కనిపించాలనే ఆరాటం సహజమే. అది తప్పేమీ కాదు. అయితే ఈ వయసులో హార్మోన్ల అసమతుల్యత కారణంగా శరీరంలో అనేక మార్పులు వస్తాయి. మొటిమలూ వాటి ప్రభావమే. అప్పటిదాకా ముద్దుగా ఉన్న ముఖంపై వాటిని చూసుకొని, అందంగా కనిపించట్లేదు అని బాధపడుతుంటారు. ఇప్పుడు నీదీ అదే పరిస్థితి. నిజానికి ప్రతి ఒక్క అమ్మాయికీ ఇది సహజం. మేమూ దాన్ని దాటొచ్చినవాళ్లమే. నీలాగే నీ స్నేహితులూ అందానికే ప్రాధాన్యం ఇస్తున్నారు కాబట్టి, టీజ్‌ చేస్తున్నారు. నువ్వేమో వాళ్ల మాటల్ని పట్టించుకుని బాధపడుతున్నావు. ఏదో పాటలో అన్నట్టు ముత్యమంత మొటిమ కూడా అందమే అని భావించు. నిన్ను నువ్వు యాక్సెప్ట్‌ చేసి చూడు. రూపాన్ని కాకుండా నీలోని సానుకూల అంశాలపై దృష్టిపెట్టు. అందరితో సరదాగా ఉంటూ, కొత్త విషయాలను నేర్చుకుంటూ వెళ్లు. నీ ఫ్రెండ్సే నిన్ను ఆదర్శంగా తీసుకుంటారు. రూపురేఖలు కాదు ఆత్మసౌందర్యం ముఖ్యం. మీ అమ్మ చెప్పేదీ నిజమే... ఇప్పట్నుంచే ఏవేవో క్రీములు రాస్తే చర్మం పాడవ్వొచ్చు. కాబట్టి, వద్దు. నీకింకా ఇబ్బందిగా ఉంటే నిపుణులను కలువు. సహజ ప్యాక్‌లు ప్రయత్నించు. ఆరోగ్యమైన ఆహారం తీసుకుంటున్నావో లేదో చూసుకో. అవి ఇట్టే దూరమవుతాయి. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్