చర్మంపై ముడతలా? ఈ ప్యాక్ వాడండి !

ఇంట్లో సహజంగా అందాన్ని చేకూర్చే పదార్థాలు అన్నీ ఉన్నా ఏది వాడితే ఏమవుతుందో అని చాలామంది అపోహపడుతుంటారు. కానీ కాస్త ఓపిక, శ్రద్ధ పెడితే చర్మాన్ని యవ్వనంగా మెరిసేలా చేయడంతో పాటు చర్మ పోషణకు అవసరమయ్యే పోషకాలను కూడా అందించవచ్చు. మనకు నచ్చినట్లు అందంగా కనిపించడానికి....

Published : 20 Sep 2022 21:11 IST

ఇంట్లో సహజంగా అందాన్ని చేకూర్చే పదార్థాలు అన్నీ ఉన్నా ఏది వాడితే ఏమవుతుందో అని చాలామంది అపోహపడుతుంటారు. కానీ కాస్త ఓపిక, శ్రద్ధ పెడితే చర్మాన్ని యవ్వనంగా మెరిసేలా చేయడంతో పాటు చర్మ పోషణకు అవసరమయ్యే పోషకాలను కూడా అందించవచ్చు. మనకు నచ్చినట్లు అందంగా కనిపించడానికి ప్రయత్నించవచ్చు. ఈ క్రమంలో సహజసిద్ధంగా లభించే అరటిపండు మనకు ఏవిధంగా ఉపయోగపడుతుందో చూద్దాం..!

బాగా ముగ్గిన దేశవాళీ అరటిపండు -1

తేనె - చెంచా

బార్లీ పౌడర్ - చెంచా

ఈ ప్యాక్ కోసం తీసుకునే అరటిపండు బాగా ముగ్గినదై ఉండాలి. అంటే చేత్తో పట్టుకుంటే మెత్తగా అయిపోయేంతగా పండినదైతే మంచిది. అలాంటి అరటిపండు, తేనె, బార్లీపౌడర్ ఒక గిన్నెలో తీసుకుని బాగా కలపాలి. అరటిపండు చర్మాన్ని పట్టి ఉండదు.. వెంటవెంటనే జారిపోతూ ఉంటుంది. అందుకే ఇది చర్మానికి పట్టి ఉండేలా చేయడానికే ఇందులో బార్లీపౌడర్ కలిపాం. ఒకవేళ అరటిపండు బాగా ముగ్గినదైతే బార్లీపౌడర్‌కు బదులు వరిపిండి చెంచా వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కింద నుంచి పైకి పూతలా వేసుకోవాలి. 30 నిమిషాల పాటు ఆరనిచ్చి చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. అయితే ఆరనివ్వమన్నాం కదా అని ఫ్యాన్ కింద ఉంటే పొరపాటే. ఈ ప్యాక్ ఎంత సహజంగా ఆరితే అంత ప్రయోజనం ఉంటుంది. ఇలా వారానికోసారి ఈ ఫేస్‌ప్యాక్‌ను అప్త్లె చేసుకోవచ్చు.

దీని వల్ల చర్మంపై ముడతలు రాకుండా ఉంటాయి. ఫలితంగా వృద్ధాప్య ఛాయలు అంత తొందరగా దరి చేరవు. అలాగే చర్మం కూడా మృదుత్వాన్ని సంతరించుకుంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్