అవాంఛిత రోమాలు పోవాలంటే ఏం చేయాలి?

హాయ్‌ మేడం. నా వయసు 26. నాకు ముఖం పైన అవాంఛిత రోమాలున్నాయి. వాటిని తొలగించుకోవడానికి రెండున్నరేళ్ల క్రితం ఓ బ్యూటీ క్లినిక్‌లో లేజర్‌ ట్రీట్‌మెంట్‌ చేయించుకున్నా. కానీ ఆ తర్వాత నా ముఖంపై నల్లటి మచ్చలయ్యాయి. అవి పూర్తిగా పోవట్లేదు. నేను లేజర్‌ ట్రీట్‌మెంట్‌ చేయించుకున్న క్లినిక్‌లో అడిగితే ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ ఇచ్చారు. రోజూ రాత్రి పడుకునేటప్పుడు పెట్టుకోమన్నారు. నెల రోజుల నుంచి ఆ క్రీమ్‌ వాడుతున్నా.

Updated : 09 Aug 2021 13:44 IST

హాయ్‌ మేడం. నా వయసు 26. నాకు ముఖం పైన అవాంఛిత రోమాలున్నాయి. వాటిని తొలగించుకోవడానికి రెండున్నరేళ్ల క్రితం ఓ బ్యూటీ క్లినిక్‌లో లేజర్‌ ట్రీట్‌మెంట్‌ చేయించుకున్నా. కానీ ఆ తర్వాత నా ముఖంపై నల్లటి మచ్చలయ్యాయి. అవి పూర్తిగా పోవట్లేదు. నేను లేజర్‌ ట్రీట్‌మెంట్‌ చేయించుకున్న క్లినిక్‌లో అడిగితే ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ ఇచ్చారు. రోజూ రాత్రి పడుకునేటప్పుడు పెట్టుకోమన్నారు. నెల రోజుల నుంచి ఆ క్రీమ్‌ వాడుతున్నా. కానీ మచ్చలు పోవట్లేదు. అవి పోవాలంటే ఏం చేయాలి? అలాగే ముఖంపైన అవాంఛిత రోమాలు మళ్లీ వస్తున్నాయి? నా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపగలరు.

- ఓ సోదరి

జ: మీ ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి లేజర్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకున్నా అవి మళ్లీ వస్తున్నాయని రాశారు. అయితే వాటిని తొలగించుకోవడానికి ముందుగా ఫేస్‌ వ్యాక్సింగ్‌ చేయించుకోవాలి. ఆ తర్వాత త్వరగా అవాంఛిత రోమాలు పెరగకుండా ఉండేందుకు ఇంట్లో లభించే ప్యాక్‌ వేసుకోవాలి. ఇందుకోసం అర టేబుల్‌స్పూన్‌ పసుపు, టేబుల్‌స్పూన్‌ పెరుగు, అర టేబుల్‌స్పూన్‌ బియ్యప్పిండి.. ఈ మూడింటినీ ప్యాక్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలు తొలగించుకున్న ప్రదేశంలో అప్లై చేసుకోవాలి. పది నుంచి పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆపై ఐదు నిమిషాల పాటు నెమ్మదిగా, మృదువుగా మర్దన చేసుకోవాలి. ఇలా వారానికోసారి చేయడం వల్ల అవాంఛిత రోమాలు త్వరగా రాకుండా ఉంటాయి.

అలాగే మీ ముఖంపై నల్లటి మచ్చలున్నాయని రాశారు. వాటిని తొలగించుకోవడానికి ఈ ప్యాక్‌ను ప్రయత్నించచ్చు. నాలుగు బాదం పప్పుల్ని రాత్రంతా పాలలో నానబెట్టాలి. ఉదయాన్నే వాటిపై ఉండే పొట్టును తొలగించి మెత్తగా రుబ్బుకోవాలి. దీనికి టేబుల్‌స్పూన్‌ కాచి చల్లార్చిన పాలు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మచ్చలున్న చోట ప్యాక్‌లా అప్లై చేసుకొని పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆపై చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఈ పద్ధతిని వారానికి రెండుసార్లు పాటించడం వల్ల ముఖంపై ఉండే నల్లటి మచ్చలు త్వరగా తగ్గుముఖం పడతాయి.

మీకు సంబంధించిన ప్రశ్నను అడగడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి...

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్