సమన్వయం చేసుకోవాలంటే..

ఇంటినీ ఆఫీసునూ సమన్వయం చేసుకోవడం.. చాలామంది మహిళలకు పెద్ద సవాలే. దాంతో కొన్నాళ్లకు అలసట మొదలై....

Updated : 22 Nov 2022 20:21 IST

ఇంటినీ ఆఫీసునూ సమన్వయం చేసుకోవడం.. చాలామంది మహిళలకు పెద్ద సవాలే. దాంతో కొన్నాళ్లకు అలసట మొదలై, అది ఒత్తిడికి దారితీస్తుంది. ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా ఉండాలంటే..

సాధారణంగా ఆఫీసు పనులకు సంబంధించిన ప్రణాళికలను క్యాలెండర్‌లో రాసుకుంటాం. అదే విధంగా మీ వ్యక్తిగత పనులూ, అవసరాల గురించీ క్యాలెండర్‌లో రాసుకోండి. దానివల్ల మీరు వ్యక్తిగత అవసరాలను మర్చిపోకుండా ఉంటారు. వాటిని చూసినప్పుడల్లా ఆఫీసు పనులు ఎంత ప్రణాళికాబద్ధంగా చేసుకోవాలనేది మీకు తెలుస్తుంది. సమన్వయం చేసుకోవడం సులువు అవుతుంది.

* ఓ పెద్ద పనిని పూర్తి చేయాల్సిన బాధ్యత మీపై ఉందా.. అయితే దాన్ని ఎన్ని గంటల్లోపు చేయాలనేది రాసుకోండి. దాన్ని పూర్తిచేసేవరకూ వీలైనంతవరకూ మిగిలినవేవీ పెట్టుకోకండి. ఈ నియమం పెట్టుకోవడం వల్ల ఏకాగ్రతగా ఒకే పనిమీద దృష్టిపెట్టగలుగుతారు. మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం సులువవుతుంది. ఇది ఆఫీసుకే కాదు, ఇంటి పనుల విషయానికీ వర్తిస్తుంది.

* ఆఫీసులో ఉన్నా, ఇంట్లో పనులు చేస్తున్నా సరే.. చిన్న ఫోన్‌కాల్‌ వస్తే చాలు వెంటనే చేస్తోన్న పని ఆపేసి దాన్ని చేతిలో తీసుకుంటాం. అదే విధంగా ఫోనులోనే సామాజిక సైట్ల యాప్‌లు ఉండటం వల్ల ప్రతి నిమిషానికోసారి వాటికి సంబంధించిన అప్‌డేట్లు చూస్తుంటాం. దాంతో చేస్తోన్న పనికి ఆటంకం కలుగుతుంది. ఏ ఒక్కటీ సమయానికి పూర్తికాక ఒత్తిడీ, ఆందోళనా తప్పదు. అందుకే రోజులో ఒక సమయంలో మాత్రమే ఫోన్‌ వాడటం, ఎస్సెమ్మెస్‌లు చూసుకుని సమాధానాలు ఇవ్వడం లాంటివి చేయాలి.

* మనల్ని చురుగ్గా ఉంచే శక్తి వ్యాయామానికి ఉంటుంది. వ్యక్తిగత శ్రద్ధ పాటించడం వల్ల ఆత్మవిశ్వాసం సొంతమవుతుంది. ఏ పనయినా చేయగల సామర్థ్యం మీ సొంతమవుతుంది. అందుకే రోజులో అరగంటసేపు కచ్చితంగా వ్యాయామం చేయాలనే నియమాన్ని పెట్టుకోవాలి. కుదిరితే పొద్దుటిపూట వ్యాయామం చేస్తే మరీ మంచిది. దానివల్ల వచ్చే శక్తి రోజంతా ఉంటుంది.

* కొన్ని పనులు ఒకదానిమీద ఒకటి వచ్చిపడుతుంటాయి. అలాంటప్పుడు కూడా అన్నింటినీ సమన్వయం చేసుకోవడం సాధ్యం కాదు. అందుకే మీ ప్రమేయం పెద్దగా లేని పనుల్ని చేయనని నిర్మొహమాటంగా చెప్పే ప్రయత్నం చేయండి. ఆఫీసులో అది సాధ్యం కాదనుకుంటే.. మీకున్న పనుల ఒత్తిడి గురించి చెప్పాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్