తప్పు.. చేస్తే తప్పేంటి?

ఈ సృష్టిలో ఎవరూ వంద శాతం పర్‌ఫెక్ట్‌ కారు. పని ప్రదేశంలోనూ ఇదే నియమం వర్తిస్తుంది. అనుభవజ్ఞులు, నైపుణ్యాలున్న వారు, ఉన్నత స్థానాల్లో ఉండే వారు కూడా తమ పనులు నిర్వర్తించే క్రమంలో ఏదో ఒక పొరపాటు దొర్లడం సహజమే! అలాంటిది మీ బృందంలో అప్పుడే కొత్తగా చేరిన ఉద్యోగులు పని విషయంలో ఏదైనా పొరపాటు...

Published : 23 Jan 2023 19:43 IST

ఈ సృష్టిలో ఎవరూ వంద శాతం పర్‌ఫెక్ట్‌ కారు. పని ప్రదేశంలోనూ ఇదే నియమం వర్తిస్తుంది. అనుభవజ్ఞులు, నైపుణ్యాలున్న వారు, ఉన్నత స్థానాల్లో ఉండే వారు కూడా తమ పనులు నిర్వర్తించే క్రమంలో ఏదో ఒక పొరపాటు దొర్లడం సహజమే! అలాంటిది మీ బృందంలో అప్పుడే కొత్తగా చేరిన ఉద్యోగులు పని విషయంలో ఏదైనా పొరపాటు చేస్తే టీమ్ లీడర్‌గా వారిని మందలించడం, కించపరచడం కూడదంటున్నారు నిపుణులు. అలాంటి సమయంలో ఓ మెంటార్‌గా వారి తప్పుల్ని ఓపికతో సరిదిద్దాలంటున్నారు. ఈ క్రమంలో పొరపాటు పునరావృతం కాకుండా ఉండేందుకు ఏం చేయాలో వారికి వివరించాల్సి ఉంటుంది. ఇలా మీరు బాధ్యతగా వ్యవహరించే తీరు కెరీర్‌లో ఇటు మీకూ ప్లస్‌ అవుతుంది.. అటు మీ కింది స్థాయి ఉద్యోగుల ఉన్నతికీ దోహదం చేస్తుంది.

వారికీ అవకాశమివ్వండి!

కింది స్థాయి ఉద్యోగులకు మెంటార్‌గా వ్యవహరించే క్రమంలో.. ఎప్పుడూ మీరు చెప్తే వారు వినడం, పనులు పురమాయించడం కాకుండా.. అప్పుడప్పుడూ పాత్రలు మార్చమంటున్నారు నిపుణులు. కొన్ని కీలక బాధ్యతలు వారికి అప్పగించి వాటిని వారు ఎలా నిర్వర్తిస్తారో పరిశీలించమంటున్నారు. దీన్నే ‘రివర్స్‌ మానిటరింగ్‌’ అంటారు. పెద్ద పెద్ద కంపెనీలు తమ ఉద్యోగుల్లోని నైపుణ్యాలను బయటికి లాగడానికి ఇలాంటి వ్యూహాన్నే అనుసరిస్తుంటాయట! నిజానికి ఇలా చేయడం వల్ల వారిలోని నాయకత్వ లక్షణాలు, నిర్ణయాలు తీసుకునే సమర్థత, సవాళ్లు ఎదుర్కొనే నైజం, వృత్తి నైపుణ్యాలు వంటివన్నీ బయటపడతాయి అని చెబుతున్నారు నిపుణులు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్