#WikkiNayan: శ్రీవారికి.. ప్రేమతో!

ఈ కాలపు పెళ్లిళ్లలో వధూవరులిద్దరూ తమ అభిరుచుల ప్రకారం అమూల్యమైన బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం కామనే! అయితే ఇందులోనూ శ్రీవారే శ్రీమతికి ఓ ఖరీదైన కానుకిచ్చి సర్‌ప్రైజ్‌ చేయడం మనం ఎక్కువగా చూస్తుంటాం. కానీ తన ఇష్టసఖుడు విఘ్నేష్‌ శివన్‌తో....

Updated : 11 Jun 2022 20:48 IST

(Photo: Instagram)

ఈ కాలపు పెళ్లిళ్లలో వధూవరులిద్దరూ తమ అభిరుచుల ప్రకారం అమూల్యమైన బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం కామనే! అయితే ఇందులోనూ శ్రీవారే శ్రీమతికి ఓ ఖరీదైన కానుకిచ్చి సర్‌ప్రైజ్‌ చేయడం మనం ఎక్కువగా చూస్తుంటాం. కానీ తన ఇష్టసఖుడు విఘ్నేష్‌ శివన్‌తో ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన నయన్‌.. భర్త నుంచి కానుక స్వీకరించడమే కాదు.. తానూ ఓ ఖరీదైన బహుమతిచ్చి అతడిని సర్‌ప్రైజ్ చేసిందట.

జంటగా చూడముచ్చటగా ఉంటారు నయన్‌-విక్కీ. ఇక దంపతులయ్యాక వీరిని చూడ్డానికి రెండు కళ్లూ చాలట్లేదంటే అతిశయోక్తి కాదు. తమ ఏడేళ్ల ప్రేమను ఇటీవలే పెళ్లి పీటలెక్కించిన ఈ జంట.. ప్రతి సందర్భంలోనూ తమ ప్రేమానురాగాలతో ఈతరం జంటలకు రిలేషన్‌షిప్‌ పాఠాలు నేర్పుతుంటారు.

ఇంతకీ ఏమిచ్చిందంటే..?!

ఇలా వీళ్ల ప్రేమ సంగతులు, పెళ్లి ముచ్చట్లే కాదు.. వివాహంలో ఇద్దరూ ఇచ్చిపుచ్చుకున్న కానుకల గురించీ ఇప్పుడంతా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా నయన్‌ తన భర్తకు ఇచ్చిన ఖరీదైన కానుక.. తన ఇష్టసఖుడిపై తనకున్న అమూల్యమైన ప్రేమను మరోసారి బయటపెట్టిందని చెప్పచ్చు. ఇంతకీ నయన్‌ ఏమిచ్చిందో తెలుసా? ఓ విలాసవంతమైన భవంతిని కొనుగోలు చేసి.. దాన్ని విక్కీ పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించి మరీ పెళ్లి కానుకగా ఇచ్చిందట ఈ ముద్దుగుమ్మ. మరి, దాని ఖరీదెంతంటే..? అక్షరాలా రూ. 20 కోట్లకు పైమాటేనట! ఇక విక్కీ కూడా తన ముద్దుల భార్యకు కోట్లాది రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలతో పాటు.. సుమారు రూ. 5 కోట్ల విలువ చేసే వజ్రాభరణాన్ని పెళ్లి వేదికపై ఆమె చేతికి తొడిగాడట. ఇలా ఒకరిని మించి మరొకరు కానుకలిచ్చుకొని తమ ప్రేమ అనంతమైందని చెప్పకనే చెప్పిందీ అందాల జంట. అయితే ఈ బహుమతుల విలువెంతైనా.. తమ ప్రేమకు ఏదీ సాటి రాదంటూ తమ అనురాగంతోనే నిరూపిస్తున్నారీ న్యూ కపుల్!

ఇలా ఒకరికొకరు విలువైన బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడమే కాదు.. తమ వివాహం సందర్భంగా ఈ జంట ఎంతోమంది అనాథలు, వృద్ధులు, చిన్నారులకు విందు భోజనం అందించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్