ఫ్రిజ్‌లో వీటిని ఒకేచోట పెట్టొద్దు!

ఫ్రిజ్‌లో పండ్లు, కూరగాయలు, మాంసం.. అన్నీ ఒకేచోట సర్దేస్తుంటాం. అయితే అలా చేయడం ఆరోగ్యానికి చేటు చేస్తుందంటున్నారు నిపుణులు. అందుకే ఈ జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు.

Updated : 19 Feb 2022 21:22 IST

ఫ్రిజ్‌లో పండ్లు, కూరగాయలు, మాంసం.. అన్నీ ఒకేచోట సర్దేస్తుంటాం. అయితే అలా చేయడం ఆరోగ్యానికి చేటు చేస్తుందంటున్నారు నిపుణులు. అందుకే ఈ జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు.

* వంట మొదలు పెట్టడానికి ముందు చేతుల్ని సబ్బుతో కడుక్కోవడం అలవాటు చేసుకోవాలి. కూరగాయలు, ఆకుకూరలను ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటిలో కడగడం మంచిది.

* కూరగాయలను ఫ్రిజ్‌లో భద్రపరుస్తున్నప్పుడు ఒక్కో రకాన్ని ఒక్కో కాగితపు సంచిలో ప్యాక్‌ చేస్తే త్వరగా వడలిపోవు. పండ్లను ఓ అరలో, కూరగాయల్ని మరో దాంట్లో పెట్టడం మంచిది.

* పచ్చి మాంసాన్ని ఫ్రిజ్‌లో పెట్టాలనుకున్నప్పుడు మూత ఉన్న డబ్బాలో ఉంచాలి. వండని మాంసం, చేపలు వంటి వాటిని కూరగాయలు, పండ్లకు దూరంగా ఉంచాలి. లేదంటే వాటిపై ఉండే బ్యాక్టీరియా పండ్లు, కూరగాయలకు వ్యాపించి పలు అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది.

* ఒకసారి వండిన మాంసాన్ని మరోసారి వేడి చేయాలనుకుంటే ఎంత ఉష్ణోగ్రత వరకు వేడి చేస్తే బ్యాక్టీరియా నశిస్తుందో ముందుగా తెలుసుకోవాలి. పండ్లు, కూరగాయలు, మాంసాన్ని.. కట్‌ చేయడానికి, వండటానికి వేర్వేరు చాకులు, పాత్రలు ఎంచుకోవడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్