Relationship: అప్పుడూ.. తోడుండాలి
పెళ్లికి ముందు చదువు, ఉద్యోగం, ఆస్తి, అంతస్థు లాంటివన్నీ చూడటం సాధారణం. ఆర్థిక ఇబ్బందులు రాకూడదనేదే లక్ష్యం. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఉద్యోగం కోల్పోవడం, వ్యాపారంలో నష్టం లాంటివి జరగొచ్చు.
పెళ్లికి ముందు చదువు, ఉద్యోగం, ఆస్తి, అంతస్థు లాంటివన్నీ చూడటం సాధారణం. ఆర్థిక ఇబ్బందులు రాకూడదనేదే లక్ష్యం. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఉద్యోగం కోల్పోవడం, వ్యాపారంలో నష్టం లాంటివి జరగొచ్చు. అలాంటప్పుడు నిట్టూర్పులు, నిందించడానికి బదులు భాగస్వామికి ధైర్యం చెప్పాలంటూ.. ఓదార్పు సూచనలు చేస్తున్నారు నిపుణులు..
* ‘నువ్వేం సోమరివి కాదు, నీ నిర్లక్ష్యంతో ఇలా జరగలేదు. నెలనెలా వచ్చే జీతం ఆగిపోతే... ఇంటద్దె, పాలు, బియ్యం, పిల్లల ఫీజులు.. అన్నీ కష్టమే. కానీ ఎదురైన పరిణామాన్ని ఒప్పుకోక తప్పదుగా! బాధపడినంతలో ఒనగూరేదేం లేదు. మరోదానికి ప్రయత్నించవచ్చు’ అనండి.
* ‘ఇది మనకు మాత్రమే వచ్చిన కష్టం కాదు. ప్రపంచాన్నే కుదిపేస్తోంది. కానీ తల్లడిల్లి ప్రయోజనం లేదు. ముందు కొంత అప్పు తీసుకుందాం. ఈలోపు మరో కొలువు రాకపోదు. లేదంటే చిన్న వ్యాపారం మొదలెడదాం. భయంకర అనారోగ్యాల నుంచే బయటపడుతున్నారు. ఆర్థికమాంద్యాన్ని అధిగమించలేమా? కొన్నాళ్లు నిబ్బరంగా ఉండాలంతే’ అని భరోసానివ్వండి.
* ‘మునుపటిలా ఉద్యోగాలు స్థిరంగా ఉండటం లేదు. లేఆఫ్‌లు సర్వ సాధారణమయ్యాయి. ఉన్నట్టుండి ఇలా జరిగింది. ఇబ్బందే కానీ.. త్వరగానే బయటపడతాం. ఒకరికొకరం ఆలంబనగా ఉన్నాం కనుక దీన్ని తట్టుకోగల’మని తోడుండి.
* ‘జీవితమన్నాక సమస్యలు వస్తాయి. తెలివిగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగడమే మనం చేయాల్సింది. అంతేగానీ అదే తలచుకుంటూ డిప్రెషన్ తెచ్చుకుంటే ఎలా? తెలివి, తెగువ ఉన్నప్పుడు బేలతనం ఎందుకు? స్థైర్యంగా ముందుకు సాగాలి. దీన్నుంచి పాఠం నేర్చుకుని ఈసారి మరింత జాగ్రత్తగా ఉంటే సరి’ అంటూ స్థైర్యాన్నివ్వండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.