వారెదుట వాదోపవాదాలొద్దు...

రాణి తన మూడేళ్ల కూతురు మధుకు చిన్న విషయంలో కూడా సర్ది చెప్పలేదు. తనకు కావాల్సింది ఇవ్వకపోతే ఏడుస్తుంది లేదా అరుస్తుంది. ఆ చిన్నారిని కంట్రోల్‌ చేయలేక భయపెట్టడానికి ప్రయత్నిస్తుందామె. ఇలాంటి సందర్భాలు చాలామంది తల్లులు ఎదుర్కొంటూనే ఉంటారు అంటున్నారు మానసిక నిపుణులు.

Updated : 19 Jun 2021 01:11 IST

రాణి తన మూడేళ్ల కూతురు మధుకు చిన్న విషయంలో కూడా సర్ది చెప్పలేదు. తనకు కావాల్సింది ఇవ్వకపోతే ఏడుస్తుంది లేదా అరుస్తుంది. ఆ చిన్నారిని కంట్రోల్‌ చేయలేక భయపెట్టడానికి ప్రయత్నిస్తుందామె. ఇలాంటి సందర్భాలు చాలామంది తల్లులు ఎదుర్కొంటూనే ఉంటారు అంటున్నారు మానసిక నిపుణులు. పిల్లల్లో ఈ మొండితనానికి పెద్దవాళ్లే కారణమంటున్నారు. ఈ గుణం అలవడకుండా ఉండేందుకు వాళ్లేం చెబుతున్నారో చూడండి...

మందలించేటప్పుడు... పిల్లలను తల్లి లేదా తండ్రి మందలించేటప్పుడు మిగతా పెద్దవాళ్లెవరూ మధ్యలో వెళ్లకూడదు. చిన్నారికి భయం చెప్పనివ్వాలి. లేదంటే తమను ఎవరూ దండించకుండా ఇంట్లో మిగతా వాళ్లు మద్దతిస్తారు అనే ఆలోచన పిల్లల్లో వచ్చిందంటే చాలు. ఎవరిమాటా వినరు. అందుకే పిల్లల ప్రవర్తన మారినప్పుడు లేదా వారేదైనా తప్పు చేసినప్పుడు తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకరు దండించాల్సిందే.
విమర్శించొద్దు... చిన్నారులకు తల్లి భయం చెప్పేటప్పుడు వారెదురుగానే తండ్రి లేదా కుటుంబ సభ్యులు ఆమెను విమర్శించకూడదు. అది పిల్లల్లో తల్లిపట్ల గౌరవం, భయం తగ్గేలా చేస్తుంది. ఇక ఆమె మాట వినిపించుకోరు. ఆ సంఘటనపై ఏదైనా చర్చించాలనుకుంటే పిల్లలెదుట చేయకుండా, తర్వాత దీని గురించి దంపతులిద్దరూ మాట్లాడుకోవాలి. అలాగే ఆ చిన్నారుల ముందే తల్లిదండ్రులు ఈ అంశంపై అరుచుకోవడం, వాదోపవాదాలు చేసుకోకూడదు. ఇవన్నీ పిల్లలపై చెడు ప్రభావాన్ని కలిగిస్తాయి. గట్టిగా అరిస్తేనే సాధించగలమనే ఆలోచన వారిలో మొలకెత్తుతుంది. ఇది క్రమేపీ మొండితనంగా మారుతుంది. అలా కాకుండా అల్లరి చేసినా కావాల్సింది దక్కదనే విషయం వారికి అర్థం కావాలంటే తల్లిదండ్రుల ప్రవర్తన మంచిగా ఉండాలి.
అడిగేలా.. ఏదైనా వస్తువు లేదా ఇంకేదైనా కావాలంటే మొండిగా, ఏడుస్తూ కాకుండా, నెమ్మదిగా అడిగితేనే తల్లిదండ్రులిస్తారనే ఆలోచన పిల్లల్లో రావాలి. వారు అడిగినది ప్రమాదకరమైతే, మరోవస్తువు వైపు వారిని మళ్లించాలి. అప్పుడు ఆ చిన్నారులు అడిగింది మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా చేయాలంటే పెద్దవాళ్లు చాలా ఓర్పుగా ప్రవర్తించాలి. ఇది పిల్లల్లో మొండితనాన్ని దూరం చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్