శుభకార్యాలకు మెరిసే మేకప్‌!

అతి కొద్దిమంది బంధువులు, తక్కువ కోలాహలం.. కరోనా కాలంలో పెళ్లి రూపమే మారిపోయింది. కానీ వధువుకు మాత్రం అది పెద్ద వేడుక.

Published : 29 Jun 2021 01:50 IST

అతి కొద్దిమంది బంధువులు, తక్కువ కోలాహలం.. కరోనా కాలంలో పెళ్లి రూపమే మారిపోయింది. కానీ వధువుకు మాత్రం అది పెద్ద వేడుక. తనదైన రోజున అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు? కానీ అలంకరణకు బయటి నుంచి సాయం తీసుకోలేని పరిస్థితి. కాబట్టి ఈ చిట్కాలతో సొంతంగా సిద్ధమైపోండి.

ముందుగా మీ చర్మానికి తగిన మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి. ఆపైనే మేకప్‌ను ప్రయత్నించాలి.

* బేస్‌: డార్క్‌ సర్కిల్స్‌ ఏమైనా ఉంటే కరెక్టర్‌తో కవర్‌ చేయాలి. తర్వాత మీ చర్మపు రంగుకు తగిన ఫౌండేషన్‌ రాసుకోవాలి. చెవులు, మెడకు కూడా అప్లై చేయాలి. ఆపై పౌడర్‌ పఫ్‌తో ట్రాన్స్‌లుసెంట్‌ పౌడర్‌ను ముఖానికీ, మెడకీ అద్దాలి. ఇది ఫౌండేషన్‌, కన్సీలర్‌ను పట్టి ఉంచడంలో సాయపడుతుంది.

* కళ్లకి: ఐబ్రో పెన్సిల్‌తో కనుబొమ్మలను తీర్చిదిద్దాలి. స్ట్రోక్స్‌ లైట్‌గా ఉండేలా చూసుకోండి. సహజమైన లుక్‌ రావడానికి ఐబ్రో జెల్‌ను పూయొచ్చు. కనురెప్పలకు మస్కారాను కోట్‌గా వేస్తే సరిపోతుంది. బ్లాక్‌ లేదా బ్రౌన్‌ కాటుకతో కళ్లను తీర్చిదిద్దుకోవాలి. ముందు ప్రైమర్‌ రాసుకుంటే కాటుక చెరగకుండా ఉంటుంది.

* పెదాలకు: లిప్‌ బామ్‌తో పెదాలను కండిషనింగ్‌ చేసుకోవాలి. తర్వాత లిప్‌లైనర్‌తో షేప్‌ను గీసుకున్నాక లిప్‌స్టిక్‌ రాసుకోవాలి. దానికి లిప్‌గ్లాస్‌ను లైట్‌గా అప్లై చేస్తే సరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్