ఆ అందం వెనుక వడ్ల ఊక...

పాలవర్ణంలో మెరుపులీనే జపాన్‌ అమ్మాయిల సౌందర్యం వెనుక రహస్యమే... వడ్ల ఊక అట. వందల సంవత్సరాల నుంచి ఇప్పటివరకు ఆ దేశమహిళల ఆరోగ్యకరమైన చర్మం, అందానికి వారు పాటిస్తున్న మరిన్ని చిట్కాలను కూడా తెలుసుకుందాం.

Published : 09 Aug 2021 01:07 IST

పాలవర్ణంలో మెరుపులీనే జపాన్‌ అమ్మాయిల సౌందర్యం వెనుక రహస్యమే... వడ్ల ఊక అట. వందల సంవత్సరాల నుంచి ఇప్పటివరకు ఆ దేశమహిళల ఆరోగ్యకరమైన చర్మం, అందానికి వారు పాటిస్తున్న మరిన్ని చిట్కాలను కూడా తెలుసుకుందాం.

* యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉండే వడ్ల ఊక పొడిని  జపాన్‌మహిళలు ముఖానికి స్క్రబ్బింగ్‌ చేయడానికి వాడతారు. సౌందర్య లేపనాల్లోనూ వినియోగిస్తారు. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. వృద్ధాప్యపు ఛాయలను దరికి చేరనీయదు.

* ఆహారంలో వాడే రాజ్మా గింజలను అందాన్ని పెంపొందించుకోవడానికి కూడా వీరు ఉపయోగిస్తారు. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ గింజల్లోని సపోనిన్‌ చర్మరంధ్రాల్లో మురికిని శుభ్రపరుస్తుంది. రాజ్మా గింజల పేస్ట్‌ని ముఖానికి రాసి రుద్దితే మురికితోపాటు మృతకణాలు దూరమవుతాయి. అలానే ముఖంపై మొటిమలు, నల్లని మచ్చలు వంటివీ తగ్గుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్