చర్మ సంరక్షణలో నయా ట్రెండ్స్‌...

సౌందర్య లేపనాల్లో ఆధునికత, ఎల్‌ఈడీ ఫేస్‌ మాస్క్‌లు, ఇంటి చికిత్సలు వంటివి రానున్న కాలంలో చర్మసంరక్షణకు సంబంధించి అతి పెద్ద మార్పులట. 2022లో వచ్చే స్కిన్‌కేర్‌ ట్రెండ్స్‌ ఇవి..

Updated : 30 Dec 2021 05:52 IST

సౌందర్య లేపనాల్లో ఆధునికత, ఎల్‌ఈడీ ఫేస్‌ మాస్క్‌లు, ఇంటి చికిత్సలు వంటివి రానున్న కాలంలో చర్మసంరక్షణకు సంబంధించి అతి పెద్ద మార్పులట. 2022లో వచ్చే స్కిన్‌కేర్‌ ట్రెండ్స్‌ ఇవి..

‘స్కినిమలిజం’... కొవిడ్‌ సమయంలో బ్యూటీపార్లర్లు మూతబడటంతో సహజ పద్ధతుల్లో సౌందర్యపోషణకు అలవాటు పడ్డారు చాలామంది. అలా ఇంట్లో చేసుకునే లేపనాలకు ప్రాముఖ్యతనిస్తున్నారు. అదే ఓ ట్రెండ్‌గా చర్మసంరక్షణ విషయంలో ‘స్కినిమలిజం’ అనే కొత్త ఉద్యమానికి తెరలేపారు.

ఇంట్లోనే... ఫేస్‌ మాస్క్‌, కెమికల్‌ పీల్‌ మాస్క్‌ వంటివన్నీ ఈ ఏడాది ప్రాచుర్యం పొందితే దీంతోపాటు సన్‌స్క్రీన్‌ లోషన్‌ వినియోగం రానున్న ఏడాదిలో పెరగనుందట.  ఎల్‌ఈడీ లైట్‌ మాస్క్‌... వచ్చే ఏడాదిలో ఎల్‌ఈడీ లైట్‌ మాస్క్‌ల ట్రెండు రానుందట. చార్జింగ్‌తో పనిచేసే ఈ మాస్క్‌ రక్తప్రసరణను చురుగ్గా జరిగేలా చేసి, చర్మానికి చక్కని రంగు తీసుకురావడమే కాదు.. ముడతలనీ తొలగిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్