నల్ల నువ్వులతో ఒత్తైన శిరోజాలు...

ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు ఉండే నల్ల నువ్వులతో జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు. వీటితో వేసే లేపనాలు శిరోజాలను రాలకుండా పరిరక్షిస్తాయని సూచిస్తున్నారు.

Updated : 29 Apr 2022 01:51 IST

ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు ఉండే నల్ల నువ్వులతో జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు. వీటితో వేసే లేపనాలు శిరోజాలను రాలకుండా పరిరక్షిస్తాయని సూచిస్తున్నారు.

ఉసిరితో కలిపి... రెండు చెంచాల నల్ల నువ్వులను కప్పు కొబ్బరినూనెలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే రెండు ఉసిరికాయల గుజ్జును ఈ నూనెకు కలిపి పాన్‌పై రెండు నిమిషాలు వేడి చేసి మిక్సీలో మెత్తగా చేసి మరోసారి పొయ్యిపై ఉంచాలి. చిక్కగా అయ్యేవరకు ఉంచి, చల్లార్చి వడకట్టాలి. ఈ నూనెను వారానికొకసారి తలకు మర్దనా చేసి తలస్నానం చేస్తే జుట్టు రాలదు.  

కలబందతో... యాంటీ ఫంగల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలుండే నల్ల నువ్వులు మాడును ఆరోగ్యంగా ఉంచుతాయి. రెండు చెంచాల నల్ల నువ్వులను నీటిలో గంట నాననిచ్చి మిక్సీలో వేసి మెత్తగా చేసి చెంచా కలబంద గుజ్జును కలపాలి. దీన్ని మాడుకు మర్దన చేసి ఆరనిచ్చి తలస్నానం చేయాలి. శిరోజాలకు రక్తప్రసరణ జరిగేలా చేసి, జుట్టు ఒత్తుగా పెరగడానికి దోహదపడుతుంది.

పెరుగుతో... నాలుగైదు చెంచాల నల్ల నువ్వులను కప్పు నీటిలో గంటసేపు నానబెట్టి, మిక్సీలో వేసి మెత్తని పేస్టులా చేసి వడకట్టాలి. ఈ నీటికి చెంచా చొప్పున పెరుగు, నువ్వులనూనె, రెండు చెంచాల కలబంద గుజ్జు, అరచెంచా నిమ్మరసం కలపాలి. దీన్ని జుట్టుకు రాసి అరగంట  తర్వాత తలస్నానం చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్