రెటినాల్‌ వాడుతున్నారా?

ముఖం మీద ముడతలు, గీతలు, మచ్చలుండొద్దు.. వృద్ధాప్య ఛాయలకు దూరంగా.. నిత్యం యవ్వనంగా ఉండాలి.. వీటన్నింటినీ నెరవేరుస్తుంది రెటినాల్‌. అందుకే దీన్ని ఎంచుకుంటున్న అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. మరి దీన్ని సరిగానే వాడుతున్నారా?

Published : 20 Jun 2022 00:28 IST

ముఖం మీద ముడతలు, గీతలు, మచ్చలుండొద్దు.. వృద్ధాప్య ఛాయలకు దూరంగా.. నిత్యం యవ్వనంగా ఉండాలి.. వీటన్నింటినీ నెరవేరుస్తుంది రెటినాల్‌. అందుకే దీన్ని ఎంచుకుంటున్న అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. మరి దీన్ని సరిగానే వాడుతున్నారా?

దీనిలోని విటమిన్‌ ఎ కణాల పునరుత్పత్తికి సాయపడుతుంది. ఫలితమే ముడతలు వంటివి దూరమై చర్మం నునుపుగా మారుతుంది. దీన్ని సీరమ్‌, క్రీమ్‌, మాయిశ్చరైజర్‌.. ఏ రూపంలో వాడినా పగలు మాత్రం రాయొద్దు. రెటినాల్‌ చర్మాన్ని సున్నితంగా మారుస్తుంది. కాబట్టి, దీన్ని రాసుకొని ఎండలోకి వెళితే దుష్ప్రభావాలే ఎక్కువ. కాబట్టి, రాత్రుళ్లు రాయడానికి ప్రాధాన్యమివ్వాలి. అలాగే పగలు కనీసం ఎస్‌పీఎఫ్‌ 30 ఉన్న సన్‌స్క్రీన్‌ని తప్పక రాయాలి.

* దీన్ని వాడేప్పుడు మెడికేటెడ్‌, రసాయనాలు ఎక్కువగా ఉండే ఫేస్‌వాష్‌లను ఉపయోగించొద్దు. చర్మతీరుకు తగ్గట్టుగా ఫోమ్‌/ హైడ్రేటింగ్‌ క్లెన్సర్‌లను ఎంచుకోవాలి. ముందు టోనర్‌, ఐక్రీమ్‌.. ఇలా ఏది వాడినా వాటి తడి చర్మంపై పూర్తిగా తొలగాకే రెటినాల్‌ను రాయాలి.

* ఇది వివిధ గాఢతల్లో దొరుకుతుంది. ముందు నుంచే ఎక్కువ గాఢత ఉన్నవాటిని ఎంచుకోవద్దు. 0.1 శాతంతో మొదలుపెట్టడం మంచిది. దాన్నీ ముఖంపై ఓ చోట కొద్దిగా రాసి, ఎరుపెక్కడం, దురద, దద్దుర్లు వంటివి లేవనిపించినప్పుడు కొనసాగించొచ్చు. ఒక్కసారే ప్రతిరోజూ రాయొద్దు. మొదట రెండు రోజులకోసారి ఓ పదిహేను రోజులపాటు ప్రయత్నించి, అంతా బాగుంది అనిపించాక రోజూ వాడొచ్చు.

* గర్భిణులు దీనికి దూరంగా ఉండాలి. ఇది పాపాయిపై దుష్ప్రభావాలు చూపించే అవకాశాలు ఎక్కువట.

* స్క్రబ్‌ చేసిన తర్వాత సున్నితమవుతుంది. అప్పుడు మళ్లీ రెటినాల్‌ను రాస్తే మరింత సెన్సిటివ్‌గా మారొచ్చు. పైగా స్క్రబ్‌లో రసాయనాలకు అవకాశమెక్కువ. కాబట్టి, రాయకూడదు. అలాగే దీనితోపాటుగా రాసే టోనర్‌, క్రీమ్‌ వగైరాల్లో ఏహెచ్‌ఏ, బీహెచ్‌ఏలు లేకుండా చూసుకోవడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్